గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు
ABN, Publish Date - May 06 , 2025 | 11:19 PM
గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. పారిశుధ్యంపై జిల్లాలోని వివిధ శాఖాధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్
పాడేరు, మే 6(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. పారిశుధ్యంపై జిల్లాలోని వివిధ శాఖాధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో శానిటేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. క్లాప్ మిత్రాలు గ్రామాల్లో ఇంటింటా తిరిగి చెత్త సేకరణ చేయాలన్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తేవాలన్నారు. ప్రఽథమ్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 5, 6 తరగతుల విద్యార్థులకు అందిస్తున్న సమ్మర్ క్యాంపులో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలన్నారు. ఆటపాటలతో అర్థమెటిక్, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో విద్యా నైపుణ్యాలు మెరుగుపరచాలని సూచించారు. మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్ల సహకారంతో వలంటీర్లను గుర్తించి విద్యార్థులకు విద్యనందించాలన్నారు. మండల స్థాయి అధికారులు విద్యా ప్రమాణాలు మెరుగుకు కృషి చేయాలని తెలిపారు. మంజూరు చేసిన తాగునీటి పథకాలు సకాలంలో పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ జవహర్‌కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, హౌసింగ్ ఈఈ బి.బాబు, జిల్లా నైపుణాభివృద్ధి అధికారిణి రోహిణి, జిల్లా ఉద్యాన వనాధికారి రమేశ్‌కుమార్‌రావు, జిల్లా సహాకార అధికారి ఎంవీ.రామకృష్ణరాజు, జిల్లాలో 22 మండలాలకు చెందిన ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 06 , 2025 | 11:19 PM