108 ఆదివాసీ జంటలకు సామూహిక వివాహం
ABN, Publish Date - May 31 , 2025 | 12:49 AM
108 ఆదివాసీ జంటలకు సామూహిక వివాహం
నూతన వధూవరులకు చిత్రపటాన్ని అందిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంగళసూత్రాలను పంపిణీ చేస్తున్న చిన్న జీయరుస్వామి.
గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని తంగేటి శ్రీనివాస కల్యాణమండంలో శుక్రవారం 108 ఆదివాసీ జంటలకు సామూహిక వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు. వికాస తరంగిణి కేంద్ర కమిటీ, దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్యఅతిథులుగా హాజరై మంగళసూత్రాలు అందించి, వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందు సమీపంలో వున్న అల్లూరి సీతారామరాజు పార్కుకు వెళ్లి అల్లూరి, గంటందొర సమాధులను, మ్యూజియంను తిలకించారు.
Updated Date - May 31 , 2025 | 12:49 AM