ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లాలో పూర్తిగా తగ్గిన మావోయిస్టుల ప్రభావం

ABN, Publish Date - May 13 , 2025 | 11:03 PM

జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. చింతపల్లి ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా సీలేరు వచ్చిన ఆయన మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ గత రెండు నెలల్లో జీకేవీధి, చింతపల్లిలో భారీగా మిలీషియా సభ్యులు లొంగిపోయారన్నారు.

మాట్లాడుతున్న చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా

గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి

చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా

సీలేరు, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. చింతపల్లి ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా సీలేరు వచ్చిన ఆయన మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ గత రెండు నెలల్లో జీకేవీధి, చింతపల్లిలో భారీగా మిలీషియా సభ్యులు లొంగిపోయారన్నారు. ఈ నెల 7న వై.రామవరం మండలం శేషరాయ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పెద్ద క్యాడర్‌ మావోయిస్టులు అయిన కాకూరి పండన్న అలియాస్‌ జగన్‌, వాగా పొడియామి అలియాస్‌ రమేశ్‌ మృతి చెందడంతో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఈ ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మరి కొంత మంది మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ పార్టీ బలగాలతో కూంబింగ్‌ ఆపరేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న వారికి తమ పోలీస్‌ శాఖ ద్వారా వారికి జీవనోపాధి కల్పిస్తామని ఆయన తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రహదారుల నిర్మాణానికి, గిరిజనుల మౌలిక వసతుల కల్పనకు జిల్లా పోలీస్‌ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కడైనా రహస్యంగా గంజాయి సాగు చేసినా అత్యాధునిక డ్రోన్లు ద్వారా వాటిని గుర్తించి ధ్వంసం చేస్తున్నామని, అలాగే అన్ని శాఖల అధికారులతో ఈగిల్‌ టీంలను ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాల్లో ఎక్కడా గంజాయి సాగు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా గంజాయి సాగు, రవాణా వంటి చర్యలకు పాల్పడినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గిరిజనులకు గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా అధిక లాభాలు వచ్చే పంటల విత్తనాలను ప్రభుత్వం నుంచి అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో జీకేవీధి సీఐ వరప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 11:03 PM