కలెక్టరేట్‌లో ’మన మిత్ర’ క్యూఆర్‌కోడ్ ఆవిష్కరణ
ABN, Publish Date - May 06 , 2025 | 11:17 PM
వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను సులభతరంగా అందించే మన మిత్ర క్యూఆర్‌కోడ్‌ను కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆవిష్కరించారు.
మన మిత్ర క్యూఆర్ కోడ్ ఆవిష్కరించిన కలెక్టర్ దినేశ్‌కుమార్, తదితరులు
పాడేరు, మే 6(ఆంధ్రజ్యోతి): వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను సులభతరంగా అందించే మన మిత్ర క్యూఆర్‌కోడ్‌ను కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆవిష్కరించారు. మన మిత్ర ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను పొందే అంశాలపై మరింతగా అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ సూచించారు. గ్రామాల్లో దానిపై ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయాల జిల్లా నోడల్ అధికారి పీఎస్.కుమార్, జిల్లా వ్యవసాయాధికారి నంద్, జిల్లా ఉద్యానవనాధికారి రమేశ్‌కుమార్‌రావు, హౌసింగ్ ఈఈ బి.బాబు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 06 , 2025 | 11:17 PM