ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పెద్దేరుకు మహర్దశ

ABN, Publish Date - Jul 11 , 2025 | 12:38 AM

జిల్లాలో తెన్నేటి విశ్వనాథం (పెద్దేరు) జలాశయం ఆధునికీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ జలాశయం నిర్లక్ష్యానికి గురైంది. కాగా దీనికి జీవం పోయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

మాడుగుల మండలం రావిపాలెంలో పెద్దేరు జలాశయం

రూ.69.38 కోట్లతో మిగులు పనులు పూర్తికి ఆమోదం

మూడు మండలాల్లో 63 గ్రామాలకు సాగునీరు

సస్యశ్యామలం కానున్న 19,969 ఎకరాల ఆయకట్టు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో తెన్నేటి విశ్వనాథం (పెద్దేరు) జలాశయం ఆధునికీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ జలాశయం నిర్లక్ష్యానికి గురైంది. కాగా దీనికి జీవం పోయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెద్దేరుకు రూ.69.39 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం పెద్దేరు జలాశయం ఆధునికీకరణకు 2023 మార్చి నెలలో రూ.84.40 కోట్లు ప్రకటించింది. అప్పట్లో ఈ పనులను విజయవాడకు చెందిన శ్రీసాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ కాంట్రాక్టు సంస్థకు రూ.69.38 కోట్లకు టెండర్‌పై అప్పగించింది. అయితే నిధులు మాత్రం ఇవ్వలేదు. పనులు నత్తనడకన సాగాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు కాంట్రాక్టర్‌ కేవలం రూ.1.7 కోట్ల విలువైన అంటే 2.45 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. ఆ తరువాత బిల్లులు అందకపోవడంతో పనులు నిలిపివేశారు. నాటి నుంచి పెద్దేరు ఆధునికీకరణ పనులు పడకేశాయి. వాస్తవానికి పెద్దేరు జలాశయం ఆధునికీకరణ పనులు జరిగితే మాడుగుల, చోడవరం నియోజకవర్గాల పరిధిలోని మాడుగుల, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లోని 63 గ్రామాల్లో 19,969 ఎకరాల మెట్ట భూములు సస్యశ్యామలం అవుతాయి. జలాశయానికి అనుబంధంగా ఉన్న పంట కాలువల రైలింగ్‌ పనులు పూర్తయితే, ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి ఇక్కట్లు తీరడమే కాకుండా జలాశయం శివారు ఆయకట్టు వరకు సాగునీరు అంది, రెండు పంటలు పండుతాయి.

ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో ఆనందం

రైతులకు సాగునీరు అందించాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పెద్దేరు జలాశయం పనులు పూర్తి చేయాలని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అరకొరగా నిలిచిన పనులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. కాగా త్వరలో గత కాంట్రాక్టు సంస్థ ద్వారానే మిగులు పనులను పునఃప్రారంభించి వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం పెద్దేరు పనులకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయనుందని జల వనరుల శాఖ ఈఈ త్రినాథం తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న జలాశయం పరిధిలోని ఆయకట్టు స్థిరీకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 11 , 2025 | 12:38 AM