ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి జాతర

ABN, Publish Date - Jun 04 , 2025 | 01:11 AM

మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది.

మాడుగుల, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి):

మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. స్థానికులతోపాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, పలువురు కూటమి నాయకులు మోదకొండమ్మను దర్శించుకుని పూజలు చేశారు. స్థానిక మహిళలు ఘటాలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. నెల రోజుల క్రితం శతకంపట్టు వద్ద కొలువుతీరిన అమ్మవారి పాదాలు, ఘటాలను ఊరేగింపుగా తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు.

Updated Date - Jun 04 , 2025 | 01:11 AM