టోల్‌ప్లాజాపైకి దూసుకువెళ్లిన లారీ
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:27 AM
మండలంలోని వేంపాడు హైవే టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం పెనుప్రమాదం తప్పింది. విశాఖ నుంచి కాకినాడ వెళుతున్న లారీ అదుపుతప్పి అతి వేగంగా వేంపాడు హైవే టోల్‌ప్లాజా కౌంటర్లను ఢీకొట్టింది.
- తప్పిన పెనుప్రమాదం
నక్కపల్లి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వేంపాడు హైవే టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం పెనుప్రమాదం తప్పింది. విశాఖ నుంచి కాకినాడ వెళుతున్న లారీ అదుపుతప్పి అతి వేగంగా వేంపాడు హైవే టోల్‌ప్లాజా కౌంటర్లను ఢీకొట్టింది. డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్పారు. టోల్‌ప్లాజా ఒకటో నంబరు కౌంటర్ నుంచి దూసుకెళ్లి, రెండవ కౌంటర్‌ను ఢీకొని ఆగిపోయింది. లారీ చక్రాలు ఊడిపోయాయి. టోల్‌ప్లాజా సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. టోల్‌ప్లాజా 1, 2 కౌంటర్లకు పాక్షికంగా నష్టం వాటిల్లింది. నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - Jul 12 , 2025 | 12:27 AM