ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లంకెలపాలెం కూడలిలో లారీ బీభత్సం

ABN, Publish Date - Jun 24 , 2025 | 01:46 AM

నగర పరిధిలోని లంకెలపాలెం కూడలిలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఒక లారీ బీభత్సం సృష్టించింది.

  • ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద బ్రేకులు ఫెయిల్‌

  • ఆగి ఉన్న కార్ల పైనుంచి దూసుకువెళ్లి మరో లారీని ఢీకొన్న వైనం

  • ముగ్గురి మృతి

  • సుమారు పది మందికి గాయాలు

  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం

లంకెలపాలెం/అనకాపల్లి రూరల్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి):

నగర పరిధిలోని లంకెలపాలెం కూడలిలో సోమవారం రాత్రి జాతీయ రహదారిపై ఒక లారీ బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న కారుపైనుంచి అతి వేగంగా దూసుకువెళ్లి...పరవాడ నుంచి లంకెలపాలెం కూడలికి వచ్చి ఆగి ఉన్న మరొక కంటైనర్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, దాదాపు పది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా రేబాకకు చెందిన పచ్చికోరు గాంధీతో పాటు మరో ఇద్దరు కారులో కేజీహెచ్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న తమ మిత్రుడిని పరామర్శించి వెనుతిరిగారు. రాత్రి సుమారు 10.15 గంటల సమయంలో లంకెలపాలెం కూడలి వద్దకు వచ్చేసరికి సిగ్నల్‌ పడడంతో వాహనాన్ని ఆపారు. అదేమార్గంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును ఈడ్చుకుంటూ పరవాడ నుంచి లంకెలపాలెం వైపు వస్తున్న ఒక కంటైనర్‌ లారీని ఢీకొంది. ఈ క్రమంలో కారులో ఉన్న గాంధీ (54)తో పాటు అనకాపల్లి కొణతాల వీధికి చెందిన కొణతాల అచ్చెన్నాయుడు (55) చనిపోయారు. అలాగే ద్విచక్ర వాహనంపై సిగ్నల్‌ వద్ద ఉన్న ఫార్మాసిటీలోని ఇసై ఫార్మా ఉద్యోగి వై.ఎర్రప్పడు (30) మృతిచెందారు. ఎర్రప్పడు స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. ఉద్యోగరీత్యా అగనంపూడిలో నివాసం ఉంటున్నారు. లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Jun 24 , 2025 | 01:46 AM