ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లీగల్‌ మెట్రాలజీ దాడులు

ABN, Publish Date - May 19 , 2025 | 01:06 AM

అనకాపల్లి మండలం పంచాయతీ కొత్తూరు పంచాయతీ శారదానగర్‌లో మాంసాహార విక్రయ దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ (లీగల్‌ మెట్రాలజీ) అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఆయా వ్యాపారులు వినియోగిస్తున్న కాటాలను అనకాపల్లి అసిస్టెంట్‌ కంట్రోలర్‌ బి.రామచంద్రయ్య, గాజువాక ఇన్‌స్పెక్టర్‌ ఉమసుందరి తనిఖీ చేశారు. చేపల దుకాణం కాటాలో కిలో గుండు పెట్టి చేపలను తూకం వేసి, అనంతరం తమ వెంట తెచ్చుకున్న కాటాతో తూకం వేయగా 750 గ్రాములు మాత్రమే వచ్చింది. కూరగాయల దుకాణంలో కిలోకు 100 గ్రాములు, మటన్‌, చికెన్‌ షాపుల్లో కిలోకు 150 గ్రాములు తక్కువ వచ్చినట్టు గుర్తించారు. మొత్తం 15 కాటాలను స్వాధీనం ఆయా దుకాణాలపై కేసులు నమోదు చేశారు.

చేపల దుకాణంలో కాటాను పరిశీలిస్తున్న అధికారులు

పలు దుకాణాల్లో కాటాల తనిఖీ

కిలోకు 110 నుంచి 250 గ్రాముల తక్కువ తూకం

15 షాపులపై కేసులు నమోదు

కొత్తూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం పంచాయతీ కొత్తూరు పంచాయతీ శారదానగర్‌లో మాంసాహార విక్రయ దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ (లీగల్‌ మెట్రాలజీ) అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఆయా వ్యాపారులు వినియోగిస్తున్న కాటాలను అనకాపల్లి అసిస్టెంట్‌ కంట్రోలర్‌ బి.రామచంద్రయ్య, గాజువాక ఇన్‌స్పెక్టర్‌ ఉమసుందరి తనిఖీ చేశారు. చేపల దుకాణం కాటాలో కిలో గుండు పెట్టి చేపలను తూకం వేసి, అనంతరం తమ వెంట తెచ్చుకున్న కాటాతో తూకం వేయగా 750 గ్రాములు మాత్రమే వచ్చింది. కూరగాయల దుకాణంలో కిలోకు 100 గ్రాములు, మటన్‌, చికెన్‌ షాపుల్లో కిలోకు 150 గ్రాములు తక్కువ వచ్చినట్టు గుర్తించారు. మొత్తం 15 కాటాలను స్వాధీనం ఆయా దుకాణాలపై కేసులు నమోదు చేశారు. వీటిలో తక్కెట కాటాలు ఏడు, ఎలక్ర్టానిక్‌ కాటాలు రెండు, కౌంటర్‌ కాటాలు ఆరు వున్నాయి. తక్కువ తూకంతో వినియోగదారులను మోసగించే వ్యాపారులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్‌ కంట్రోలర్‌ బి.రామచంద్రయ్య తెలిపారు. ప్రతి తూకం యంత్రానికి తమ శాఖ వేసిన సీల్‌ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. తనిఖీల్లో సిబ్బంది లీలా శ్రీనివాస్‌, ఎస్‌.కె.బాజీ, కృష్ణతులసి పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 01:06 AM