ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శాంతిభద్రతలు భేష్‌

ABN, Publish Date - Jun 11 , 2025 | 11:46 PM

కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై గిరిజనులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ వర్గాల ప్రజలను ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం పలకరించింది. వారి అభిప్రాయాలను సేకరించింది.

సామాజిక పెన్షన్ల పెంపు, పంపిణీపై హర్షం

గిరిజన పథకాల అమలుపై అసంతృప్తి

మారుమూల ప్రాంతాలకు రహదారులు నిర్మించకపోవడంపై నిస్పృహ

భవిష్యత్తులో అన్నీ అమలు చేస్తారని పలువురి ఆశాభావం

‘ఆంధ్రజ్యోతి’తో తమ అభిప్రాయాలను పంచుకున్న గిరిజనం

నేటితో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై గిరిజనులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ వర్గాల ప్రజలను ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం పలకరించింది. వారి అభిప్రాయాలను సేకరించింది. వైసీపీ పాలనలో శాంతిభద్రతలు గాడి తప్పడంతోపాటు సామాన్యులు సైతం ఆందోళన చెందేలా ఉన్న దుస్థితిని, కూటమి ప్రభుత్వం గాడిన పెట్టి శాంతిభద్రతలను చక్కగా నిర్వహిస్తుందని ఎక్కువ మంది ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక పెన్షన్ల పంపిణీలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్మును అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. అయితే గిరిజన పథకాలను అమలు చేయకపోవడం, మారుమూల గ్రామాలకు రోడ్డు సదుపాయాలు లేకపోవడంపై గిరిజనులు అసంతప్తి చెందుతున్నారు. ఏడాదిలోనే శాంతిభద్రతలు మెరుగుపడడం, మెగా డీఎస్సీకి చర్యలు చేపట్టడం, కొన్ని గ్రామాలకు రోడ్లు వేసేందుకు నిధులు మంజూరు కావడం వంటి వాటిపై గిరిజనుల్లో సానుకూలత కనిపించింది. కానీ ప్రత్యేకంగా గిరిజనుల కోసం ఉండే పథకాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టలేదనే భావన వ్యక్తమవుతున్నది. అయితే ఏడాది పాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన గిరిజనులు, రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కాగా అమలు చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

గిరిజన పథకాల అమలుపై ఎదురు చూపులు

వైసీపీ ప్రభుత్వం తొలగించిన గిరిజన పథకాలను ఎప్పుడు తిరిగి అమలు చేస్తారనేదానిపై ఏజెన్సీలోని గిరిజనులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. క్షేత్ర స్థాయిలో నేరుగా గిరిజనులకు లబ్ధి చేకూరే సంక్షేమ పథకాలను గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే రద్దయిన ఎస్‌టీ పథకాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందనే ఆశాభావంతో అధిక సంఖ్యలో గిరిజనులున్నారు. తమ పిల్లలను కార్పొరేట్‌ స్కూళ్లలో చదివించుకునే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకాన్ని అమలు చేయాలని పాడేరు మండలం వంట్లమామిడి గ్రామానికి చెందిన మాదెల రాంబాబు కోరారు. ఇంటింటా రేషన్‌ కాకుండా డిపోల ద్వారా పంపిణీతో అనేక గ్రామాలకు చెందిన గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని డుంబ్రిగుడ మండలం కోసంగి గ్రామానికి చెందిన వంతాలదొన్ను తెలిపారు. అలాగే ఏజెన్సీలో వైసీపీ, కూటమి ప్రభుత్వ పాలనకు ఈ ఏడాదిలో పెద్దగా తేడా కనిపించలేదని హుకుంపేట మండలం కుడబీరు గ్రామానికి చెందిన సందడి రాజారావు అన్నారు. కూటమి పాలన బాగుందని, రోడ్లు, తాగునీటి సదుపాయాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని జి.మాడుగుల మండలం రచ్చపల్లికి చెందిన పాటి భీమరాజు తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా మెగా డీఎస్సీ ద్వారా టీచర్‌ పోస్టులు భర్తీ చేయడం ఆనందమని డుంబ్రిగుడ మండలం కించుమండకు చెందిన యువకుడు రాజారావు అభిప్రాయపడగా, తల్లికి వందనం ఇవ్వాలని ఇద్దరు పిల్లలున్న కించుమండ గ్రామానికి చెందిన రత్నమ్మ కోరింది. ట్రైకార్‌, రాయితీపై వ్యవసాయ, ఉద్యాన పంటల విత్తనాలు, యంత్రాలు ఇచ్చే కార్యక్రమాలు అమలు చేయాలని పాడేరు మండలం బరిసింగి గ్రామానికి చెందిన కుర్డా బాలకృష్ణ కోరారు. సామాజిక పెన్షన్ల పంపిణీ బాగుందని జి.మాడుగుల మండలం వి.కోడాపల్లికి చెందిన సెర్రికి సత్యనారాయణ తెలిపారు.

Updated Date - Jun 11 , 2025 | 11:46 PM