ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూ సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలి

ABN, Publish Date - Apr 17 , 2025 | 10:45 PM

భూములకు సంబంధించిన సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులకు గురువారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌. పక్కన జేసీ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌, డీఆర్‌వో పద్మలత

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

పాడేరు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): భూములకు సంబంధించిన సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులకు గురువారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలు అనేకం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి సైతం రెవెన్యూలోని భూ సమస్యలు, పెండింగ్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ క్రమంలో రెవెన్యూ సదస్సుల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. తమ దృష్టికి వచ్చిన ఇతర సమస్యలపైనా దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే క్రమంలో వాస్తవ పరిస్థితులు, నిబంధనలను పక్కాగా అనుసరించాలని సూచించారు. ఒకసారి భూ సమస్యను పరిష్కరించిన తరువాత మరోమారు దానిపై ఫిర్యాదులు రాకూడదన్నారు. భూ సమస్యలను పరిష్కరించే క్రమంలో నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని, ప్రతి వారం ప్రగతి నివేదికలను సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, ఏజెన్సీ 11 మండలాలకు చెందిన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 10:45 PM