పోలవరం నిర్వాసిత కాలనీలకు స్థల సేకరణ
ABN, Publish Date - May 03 , 2025 | 11:55 PM
పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైన వారికి కాలనీలను నిర్మించేందుకు అవసరమైన స్థలాలను వేగంగా సేకరించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రంపచోడవరం, అడ్డతీగల, గంగవరం మండలాల్లో గుర్తించిన స్థలాల పరిశీలన పూర్తి చేయాలన్నారు.
- రంపచోడవరం, అడ్డతీగల, గంగవరం మండలాల్లో గుర్తించిన స్థలాల పరిశీలన పూర్తి చేయాలి
- అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశ ం
పాడేరు, మే 3(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైన వారికి కాలనీలను నిర్మించేందుకు అవసరమైన స్థలాలను వేగంగా సేకరించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రంపచోడవరం, అడ్డతీగల, గంగవరం మండలాల్లో గుర్తించిన స్థలాల పరిశీలన పూర్తి చేయాలన్నారు. అలాగే చింతూరు, కూనవరం, వీఆర్.పురం, ఎటపాక మండలాల్లో ముంపు ప్రాంతాల్లోని నిర్మాణాలు, వాటి విలువలను నిర్ధారించాలన్నారు. అలాగే ఆయా మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో 4,746 నిర్మాణాలను గుర్తించినప్పటికీ 3,252 నిర్మాణాలకు మాత్రమే విలువ నిర్ధారించారని, మిగిలిన వాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు సంబంధించిన వ్యవహారాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచి పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ తిరుమలరావు, పునరావస విభాగం, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 03 , 2025 | 11:55 PM