ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖతో కోట అనుబంధం

ABN, Publish Date - Jul 14 , 2025 | 12:49 AM

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావుకు విశాఖపట్నంతో మంచి అనుబంధం ఉంది.

విశాఖపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి):

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావుకు విశాఖపట్నంతో మంచి అనుబంధం ఉంది. ఆదివారం ఆయన మృతి చెందిన సందర్భంగా పలువురు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుమారు నాలుగు దశాబ్దం క్రితం వచ్చిన ‘ప్రతిఘటన’ సినిమా షూటింగ్‌ విశాఖలో పలుచోట్ల జరిగింది. పార్కు హోటల్‌ పరిసరాలు, గవర్నర్‌ బంగ్లా రోడ్డులో బేతనీ స్కూల్‌, కేర్‌ (అప్పట్లో సీడీఆర్‌) ఆస్పత్రి ఎదురుగా రోడ్డుపై జరిగిన షూటింగ్‌లో కోట శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. అలాగే ‘గిల్లికజ్ఙాలు’ సినిమాకు సంబంధించి ఆయన పలు సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. కళారంగాలకు చెందిన ప్రముఖులకు ఇచ్చే వంశీ బర్కిలి అవార్డు ప్రదానం చాలాకాలం క్రితం విశాఖలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోటాకు వంశీబర్కిలి అవార్డును ఇక్కడే ప్రదానంచేశారు. కాగా 2008లో రామానాయుడు స్టూడియో ప్రారంభోత్సవానికి స్టూడియో అధినేత డి.రామానాయుడుతో కలిసి కోట శ్రీనివాసరావు ఇక్కడకు విచ్చేశారు. విశాఖ ఏజెన్సీలో పలు సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొన్న ఆయన.. సాగరతీరంలో జరిగిన టి.సుబ్బరామిరెడ్డి సేవా పీఠం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు సైతం హాజరయ్యారు.


19న జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం

విశాఖపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ స్టాండింగ్‌కమిటీ సమావేశాన్ని ఈ నెల 19న నిర్వహించనున్నట్టు కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన అజెండా తయారీ కోసం ప్రతిపాదనలను వివిధ విభాగాల నుంచి తెప్పించుకుంటున్నారు. స్టాండింగ్‌ కమిటీ సమావేశంపై ఇప్పటికే సభ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు.. అజెండా ఖరారయ్యాక వాటి ప్రతులను వారికి అందజేస్తామని పేర్కొన్నారు.


కలెక్టర్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామన్న అధికారులు

విశాఖపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి):

జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ సృష్టించారు. కలెక్టర్‌ పేరు, ఫొటోతో ఈ అకౌంట్‌ను తెరిచినట్టు అధికారులు గుర్తించారు. ఈ అకౌంట్‌ నుంచి రిక్వెస్ట్‌లు వచ్చినా, ఇతర డిమాండ్లు చేసినా ఎవరూ స్పందించవద్దని అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇది పూర్తిగా నకిలీ అకౌంట్‌ అని, ఈ అకౌంట్‌ నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని కలెక్టరేట్‌ అధికారులు ఒక ప్రకటనలో కోరారు.


నగరానికి కేంద్రమంత్రి సర్పానంద్‌

విశాఖపట్నం, జూలై 13 (ఆంధ్రజ్యోతి)

నగరంలో సోమవారం నుంచి రెండు రోజులపాటు జరగనున్న ’బిమ్స్‌టెక్‌’ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి కేంద్ర జల రవాణా శాఖా మంత్రి సర్పానంద్‌ సోనేవాలా ఇక్కడకు చేరకున్నారు. విమానాశయ్రంలో ఆయనకు విశాఖ పోర్టు చైర్మన్‌ అంగముత్తు, డిప్యూటీ చైర్మన్‌ దూబే, తదితరులు స్వాగతం పలికారు.

Updated Date - Jul 14 , 2025 | 12:49 AM