ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

88 ఎకరాల అభివృద్ధికి జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టు

ABN, Publish Date - May 17 , 2025 | 12:47 AM

మధురవాడలో వీఎంఆర్డీఏకు చెందిన 87.80 ఎకరాల భూమిని జాయింట్‌ వెంచర్‌ కింద అభివృద్ధి చేయడానికి ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకురావాలని సంస్థ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ పిలుపునిచ్చారు.

  • ఆసక్తి గల సంస్థలు ముందుకు రావాలని వీఎంఆర్డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ పిలుపు

  • రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో కలిసి నగరంలో రోడ్‌ షో

  • ఆరు నెలల్లో డబుల్‌ డెక్కర్‌ మోడల్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు పనుల ప్రారంభం

విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి):

మధురవాడలో వీఎంఆర్డీఏకు చెందిన 87.80 ఎకరాల భూమిని జాయింట్‌ వెంచర్‌ కింద అభివృద్ధి చేయడానికి ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకురావాలని సంస్థ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ పిలుపునిచ్చారు. దీనిపై వీఎంఆర్‌డీఏ శుక్రవారం రోడ్‌ షో నిర్వహించింది. ఇందులో క్రెడాయ్‌, నరెడ్కో, అప్రెడా తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రణవ్‌గోపాల్‌, కమిషనర్‌ విశ్వనాథన్‌లు మాట్లాడుతూ ఖరగ్‌పూర్‌ నుంచి విశాఖ వరకు బీచ్‌ కారిడార్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. విశాఖలో డబుల్‌ డెక్కర్‌ మోడల్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్‌ సిద్ధమైందని, ఆరు నెలల వ్యవధిలో పనులు కూడా మొదలవుతాయన్నారు. దక్షిణ భారతదేశానికి డేటా సెంటర్‌ సిటీగా మారబోతున్న విశాఖలో అదానీ, గూగుల్‌ డేటా సెంటర్లకు కేవలం కిలోమీటరు దూరంలోనే వీఎంఆర్డీఏ భూమి ఉందని, అందులో కన్వెన్షన్‌ సెంటర్లు, రెసిడెన్షినయల్‌, హాటళ్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవచ్చన్నారు. ఇది ఐటీ పార్కుకు, భోగాపురం విమానాశ్రయం చాలా సమీపంలో ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తగిన ప్రతిపాదనలతో ముందుకువస్తే వారికి అభివృద్ధి చేసిన దాంట్లో తగిన వాటా ఇస్తామని, ఇరు వర్గాలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టు కోసం ఈ నెల 23న హైదరాబాద్‌లో, 30న బెంగళూరులో రోడ్‌ షోలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ రమేశ్‌, సెక్రటరీ మురళీకృష్ణ, చీఫ్‌ ఇంజనీర్‌ వినయ్‌కుమార్‌, ఎస్‌ఈలు భవానీశంకర్‌, బలరామరాజు, పీవోలు వెంకటేశ్వరరావు, అరుణవల్లి, చామంతి, మౌనిక, తదితరులు పాల్గొన్నారు.


ఆ 88 ఎకరాల్లోనే ఫిన్‌టెక్‌ సిటీ!

జూన్‌ మొదటి వారంలో టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభం

రూ.2 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

జిల్లాకు ఐటీ మేనేజర్‌ ఎక్కడ?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో కొత్తగా మరో ఫిన్‌టెక్‌ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మధురవాడలో వీఎంఆర్డీఏకు చెందిన 88 ఎకరాల స్థలంలో దీనిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ భూమిని జాయింట్‌ వెంచర్‌ కింద అభివృద్ధి చేయాలని వీఎంఆర్డీఏ రోడ్‌ షోలు నిర్వహిస్తోంది. ఇందులో పేర్కొన్న ఐటీ సిటీలో ఫిన్‌టెక్‌ సిటీ ఒక భాగమని జిల్లా అధికారులు శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వాస్తవానికి 2018లోనే రుషికొండ ఐటీ పార్కులోని ‘మహతి టెక్నాలజీ’ భవనంలో ఫిన్‌టెక్‌ సిటీని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. పేటీఎం వంటి సంస్థలను తీసుకువచ్చారు. ఆ తరువాత ఆయన విశాఖను ‘క్యాష్‌లెస్‌ ట్రాన్జాక్షన్స్‌’ సిటీగా ప్రకటించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐటీని పట్టించుకోకపోవడంతో రుషికొండలోని ఫిన్‌టెక్‌ సంస్థలు ఒక్కొక్కటిగా వెళ్లిపోయాయి. ఇప్పుడు అద్దె భవనాల్లో కాకుండా సొంతంగానే రాష్ట్ర ప్రభుత్వం ‘ఫిన్‌టెక్‌ సిటీ’ని నిర్మించాలని ప్రణాళిక రూపొందిస్తోంది. ఇది కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

మొదటి వారంలో టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభం

రాష్ట్ట్రంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, స్టార్టప్‌లకు అండగా ఉండడానికి ‘రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌’ను ప్రభుత్వం అమరావతిలో నెలకొల్పింది. దీనికి అనుబంధంగా మరో ఎనిమిది రీజనల్‌ కేంద్రాలను ప్రకటించింది. వీటిని అభివృద్ధి చేసే బాధ్యతలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించింది. విశాఖలో రీజనల్‌ హబ్‌ను జీఎంఆర్‌ గ్రూపునకు ఇచ్చారు. ఇందుకోసం వీఎంఆర్డీఏ సిరిపురం జంక్షన్‌లో కొత్తగా నిర్మించిన ‘ది డెక్‌’ భవనంలో ఒక అంతస్థును కేటాయించారు. దీనికి అవసరమైన మౌలిక వసతుల కోసం తాజాగా ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలను విడుదల చేయడంతో ఇంటీరీయర్‌ పనులను ప్రారంభించారు. దీనిని జూన్‌ మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉందని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ‘ఆంధ్రజ్యోతి’కి శుక్రవారం తెలిపారు.

జిల్లాకు ఐటీ మేనేజర్‌ ఏరీ?

ప్రతి జిల్లాలో ఐటీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఒక మేనేజర్‌ను నియమించుకోవాలని రాష్ట్ట్ర ప్రభుత్వం సూచించింది. విశాఖపట్నంలో గతంలో టెక్‌ మహేంద్రాలో ఏపీటా కార్యాలయం ఉండేది. అధికారులు కూడా ఉండేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారిని తొలగించింది. ఆ తరువాత రుషికొంండ స్టార్టప్‌ విలేజ్‌లో జాయింట్‌ డైరెక్టర్‌ కేడర్‌లో ఒక మహిళ పనిచేసేవారు. ఆమె కూడా ఇప్పుడు లేరు. ఐటీ సంస్థలకు రావాల్సిన రాయితీ బకాయిల కోసం సంప్రతించడానికి కూడా ఎవరూ లేరు. అందువల్ల తక్షణమే ఒక మేనేజర్‌ను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - May 17 , 2025 | 12:47 AM