ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అదుర్స్‌

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:59 AM

ఐఐటీ, తత్సమాన విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం గత నెల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాల్లో నగరంలోని పలు విద్యా సంస్థల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచారు.

  • నగర విద్యార్థికి ఓబీసీ కేటగిరీలో ఫస్ట్‌ ర్యాంకు

  • ఓపెన్‌ కేటగిరీలో 18, 26, 78, 116, 118, 132, 216, 278, 279, 284, 334 ర్యాంకులు

    విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి):

ఐఐటీ, తత్సమాన విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం గత నెల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాల్లో నగరంలోని పలు విద్యా సంస్థల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచారు. శ్రీచైతన్య ఐఐటీ అకాడమీ విద్యార్థి డి.జ్ఞాన రుత్విక్‌సాయి 360కి 310 మార్కులు తెచ్చుకుని ఓబీసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు, ఓపెన్‌ కేటగిరీలో 18వ ర్యాంకు సాధించాడు. నగరంలో చదువుకున్న విద్యార్థికి నాలుగేళ్ల తరువాత ఓబీసీ కేటగిరీలో ప్రథమ ర్యాంకు రావడం విశేషం. అన్ని కేటగిరీల్లో కలిపి సుమారు 500 మందికిపైగా మంచి ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో పి.హేమసాయి సూర్యకార్తీక్‌ 26వ ర్యాంకు (ఓబీసీలో 4), కె.రసజ్ఞాన 78వ ర్యాంకు (ఓబీసీలో 8), తాళాబత్తుల మనోహర్‌ 116వ ర్యాంకు (ఓబీసీలో 15), పి.టి.ఆనందచక్రవర్తి 118వ ర్యాంకు, ఎం.పూర్ణసాయి 132వ ర్యాంకు, బి.విక్రమ రాజా 216 (ఓబీసీలో 30), ఎ.సాత్విక్‌ 278వ ర్యాంకు, పి.ఆదిశిష్టు సుబ్రహ్మణ్యం 279వ ర్యాంకు, జె.యోగేశ్వర్‌ 284 (ఓబీసీలో 40), పీవీ సూర్య వినయ్‌ 334, పొట్నూరు కార్తీక్‌ 419వ ర్యాంకు, డి.సాయిధర్మ ప్రతాప్‌ 432వ ర్యాంకు, కేవీ అరవింద్‌కుమార్‌ 442వ ర్యాంకు, ఎస్‌.నిర్మిత్‌ 447, బి.మహంతో 461వ ర్యాంకు, ఆర్‌.కార్తీక్‌ 526, కె.చరణ్‌రాజు 547, బి.మహిత్‌ 551, టి.గౌతమ్‌ విజయకాశ్యప్‌ 557, డి.బలరాంనాయుడు 633వ ర్యాంకు, బి.రోహిత్‌దత్తా 657వ ర్యాంకు, ఎం.పవన్‌ కుమార్‌నాయుడు 750వ ర్యాంకు, ఎస్‌.హరిచరణ్‌ 799వ ర్యాంకు, ఎల్‌.చరణ్‌సాయి 963వ ర్యాంకు సాధించారు. ఇంకా ఓబీసీ కేటగిరీలో కె.నవదీప్‌రాజుకు 31వ ర్యాంకు, తారక్‌రామ్‌కు 151వ ర్యాంకు వచ్చాయి. శ్రీచైతన్య, నారాయణ ఐఐటీ అకాడమీ, అసెంట్‌, శ్రీవిశ్వ విద్యాసంస్థల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు.

Updated Date - Jun 03 , 2025 | 12:59 AM