ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శరవేగంగా జన్‌మన్‌ గృహ నిర్మాణాలు

ABN, Publish Date - May 18 , 2025 | 12:37 AM

పీఎం జన్‌మన్‌ గృహ నిర్మాణాలను 2026 మార్చి 31 నాటికి శత శాతం పూర్తి చేస్తామని జిల్లా గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.బాబు నాయక్‌ తెలిపారు. శనివారం మండలంలోని తమ్మంగుల పంచాయతీ వర్తనపల్లి గ్రామంలో పక్కా గృహాల లబ్ధిదారులతో గ్రౌండింగ్‌ మేళా నిర్వహించారు. గ్రామంలో 40 మంది గిరిజనుల గృహ నిర్మాణాలకు భూమి పూజ చేసి మార్కింగ్‌ ఇచ్చారు. లబ్ధిదారులు ఇంజనీరింగ్‌ అధికారులు ఇచ్చిన మార్కింగ్‌ ఆధారంగా పునాదులు తీసుకున్నారు.

వర్తనపల్లి గ్రామంలో పునదులు తవ్వుతూ గ్రౌండింగ్‌ మేళా నిర్వహించిన పీడీ బాబు నాయక్‌

- వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం

- నిర్మాణాలకు నిధుల కొరత లేదు

- హౌసింగ్‌ పీడీ బాబు నాయక్‌

చింతపల్లి, మే 17 (ఆంధ్రజ్యోతి): పీఎం జన్‌మన్‌ గృహ నిర్మాణాలను 2026 మార్చి 31 నాటికి శత శాతం పూర్తి చేస్తామని జిల్లా గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.బాబు నాయక్‌ తెలిపారు. శనివారం మండలంలోని తమ్మంగుల పంచాయతీ వర్తనపల్లి గ్రామంలో పక్కా గృహాల లబ్ధిదారులతో గ్రౌండింగ్‌ మేళా నిర్వహించారు. గ్రామంలో 40 మంది గిరిజనుల గృహ నిర్మాణాలకు భూమి పూజ చేసి మార్కింగ్‌ ఇచ్చారు. లబ్ధిదారులు ఇంజనీరింగ్‌ అధికారులు ఇచ్చిన మార్కింగ్‌ ఆధారంగా పునాదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలకు నిధుల కొరత లేదని, లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు నగదు చెల్లిస్తున్నామని చెప్పారు. 2023-24, 2024-25 వార్షిక సంవత్సరానికి సంబంధించి పీఎం జన్‌మన్‌ పథకంలో జిల్లా వ్యాప్తంగా 38,801 పక్కా గృహాలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 27,014 పక్కా గృహాలను లబ్ధిదారులు నిర్మించుకున్నారన్నారు. మిగతా 11,787 పక్కా గృహాలను నిర్మించుకోవాల్సి వుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక హౌసింగ్‌ ఏఈ రమణబాబు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజారావు, సర్పంచ్‌ సలిమితి లక్ష్మయ్య, ఉప సర్పంచ్‌ మల్లేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు అప్పారావు, పీసా కమిటీ సభ్యులు భాస్కరరావు, కూటమి నాయకులు భీమన్న, బుజ్జిబాబు, త్రినాథ్‌, భాస్కరావు, చిట్టిబాబు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:37 AM