ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శరవేగంగా జల్‌జీవన్‌ పనులు

ABN, Publish Date - Jul 07 , 2025 | 11:33 PM

సబ్‌ డివిజన్‌ పరిధిలో రూ.106 కోట్ల నిధులతో 1,082 జల్‌జీవన్‌ మిషన్‌ రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం చేపడుతున్నామని పాడేరు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బీవీవీ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం చింతపల్లి, జీకేవీధి మండలంలో ఆయన పర్యటించారు.

చింతపల్లి సీపీడబ్ల్యూ మంచినీటి ట్యాంక్‌ను పరిశీలిస్తున్న ఈఈ నాగేశ్వరారవు

సబ్‌ డివిజన్‌లో రూ.106 కోట్లతో మంచినీటి పథకాల నిర్మాణం

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ బీవీవీ నాగేశ్వరరావు

చింతపల్లి/గూడెంకొత్తవీధి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): సబ్‌ డివిజన్‌ పరిధిలో రూ.106 కోట్ల నిధులతో 1,082 జల్‌జీవన్‌ మిషన్‌ రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం చేపడుతున్నామని పాడేరు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బీవీవీ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం చింతపల్లి, జీకేవీధి మండలంలో ఆయన పర్యటించారు. రూ.29 లక్షల నిధులతో దేవరాపల్లి గ్రామంలో నిర్మించిన జేజేఎం మంచినీటి పథకాన్ని, చింతపల్లి మండల కేంద్రం గూణలంక సీపీడబ్ల్యూ పథకం నీటి సరఫరా చేస్తున్న మంచి నీటి బావులను పరిశీలించారు. అనంతరం సబ్‌ డివిజన్‌ కేంద్రంలో కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల ఇంజనీరింగ్‌ అధికారులు, జేజేఎం పథకాలు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి కొళాయి కనెక్షన్‌ ఇచ్చేంచేందుకు జల్‌జీవన్‌ మిషన్‌ మంచి నీటి పథకాలు నిర్మిస్తున్నామన్నారు. చింతపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో 650 మంచి నీటి పథకాల నిర్మాణాలు పూర్తిచేసి గిరిజన కుటుంబాలకు మంచినీటి కొళాయి కనెక్షన్లు ఇచ్చామన్నారు. 120 మంచినీటి పథకాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. మరో 312 జేజేఎం పథకాలు టెండర్‌ దశలో ఉన్నాయన్నారు. నిర్మాణ దశలో ఉన్న రక్షిత మంచినీటి పథకాలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు. టెండర్‌ దశలోనున్న పథకాలు సైతం నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వినియోగంలోనున్న మంచినీటి పథకాల నిర్వహణపై స్థానిక ప్రజల పర్యవేక్షణ ఉండాలన్నారు. గిరిజన గ్రామాల్లో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక డీఈఈ జి.కరుణ, కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి ఏఈఈలు ఎస్‌.సాయి కృష్ణ, వి.కల్యాణ్‌ రామ్‌, గడుతూరు స్వర్ణలత పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:33 PM