ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చేపల వేటకు వేళాయె!

ABN, Publish Date - Jun 14 , 2025 | 01:21 AM

సముద్రంలో చేపలవేట శనివారం అర్ధరాత్రి నుంచి మొదలు కానున్నది. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల విరామం శనివారంతో ముగియనున్నది. ఆదివారం నుంచి చేపల వేట సాగించడానికి మత్స్యకారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వలలు, బోట్లు, ఇంజన్లకు మరమ్మతులు పూర్తి చేశారు. బోట్లకు రంగులు వేశారు.

చేపల వేట కోసం బోటును సిద్ధం చేసుకుంటున్న మత్స్యకారులు

నేటి అర్ధరాత్రితో ముగియనున్న ‘రెండు నెలల’ నిషేధం

రేపటి నుంచి సముద్రంలో చేపల వేట ప్రారంభం

వేట నిషేధ సమయంలో రెట్టింపు భృతి ఇవ్వడంతో మత్స్యకారులకు ఊరట

అచ్యుతాపురం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో చేపలవేట శనివారం అర్ధరాత్రి నుంచి మొదలు కానున్నది. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల విరామం శనివారంతో ముగియనున్నది. ఆదివారం నుంచి చేపల వేట సాగించడానికి మత్స్యకారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వలలు, బోట్లు, ఇంజన్లకు మరమ్మతులు పూర్తి చేశారు. బోట్లకు రంగులు వేశారు.

జిల్లాలో సముద్ర తీరం వెంబడి పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, ఎస్‌రాయవరం, పాయకరావుపేట మండలాలు వున్నాయి. ఆయా మండలాల్లోని పూడిమడక, బంగారమ్మపాలెం, రాజయ్యపేట, బోయపాలెం, రేవుపోలవరం, ముత్యాలమ్మపాలెం, వెంకటనగరం, రాజానగరం, కొత్తపట్నం, వాడ నర్సాపురం, పాల్మన్‌పేట, కొర్లయ్యపాలెం, డీఎల్‌పురం, గజపతినగరం, పెదతీనార్ల గ్రామాల్లో సముద్రంపై చేపల వేట సాగించే మత్స్యకారులు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి వరకు సముద్రంలో చేపలు, రొయ్యలు, ఇతర సంపద వేటపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. గత ఏడాది జిల్లాలో 2,168 మంది మత్స్యకారులు చేపల వేట నిషేధ భృతికి అర్హులుగా మత్స్యశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది 2,400 మందిని అర్హులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున రూ.4.8 కోట్లు ఆయా మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రెండు నెలల క్రితమే జమ చేసింది. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం రెట్టింపు భృతి ఇవ్వడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 14 , 2025 | 01:21 AM