ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేడే ఐటీడీఏ పాలకవర్గ భేటీ

ABN, Publish Date - Apr 20 , 2025 | 11:13 PM

స్థానిక ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఎట్టకేలకు 33 నెలల తరువాత సోమవారం ఐటీడీఏ చైర్మన్‌ హోదాలో కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 2022 జూలై రెండవ తేదీన ఐటీడీఏ 73వ పాలకవర్గ సమావేశం జరగ్గా, ఇప్పుడు 74వ సమావేశం నిర్వహించనున్నారు.

పాలకవర్గ సమావేశానికి సిద్ధమైన వేదిక

33 నెలల తరువాత ఎట్టకేలకు నిర్వహణ

హాజరుకానున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి

వాడీవేడిగా జరగనున్న సమావేశం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

స్థానిక ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఎట్టకేలకు 33 నెలల తరువాత సోమవారం ఐటీడీఏ చైర్మన్‌ హోదాలో కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 2022 జూలై రెండవ తేదీన ఐటీడీఏ 73వ పాలకవర్గ సమావేశం జరగ్గా, ఇప్పుడు 74వ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

గత 33 నెలలుగా ఐటీడీ ఏ పాలకవర్గ సమావేశాలు జరగకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా పాలన సాగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతంలో వార్డు సభ్యుడు మొదలుకుని పార్లమెంటు సభ్యుడు వరకు అధికార పార్టీకి చెందిన వాళ్లే ఉండడంతో ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను నిర్వహించాలని ఎవరూ డిమాండ్‌ చేయలేదు. దీంతో ఇదే అదనుగా అధికారులు కూడా మిన్నకున్నారు.

వాడీవేడిగా జరగనున్న పాలకవర్గ సమావేశం

ఐటీడీఏ 74వ పాలకవర్గ సమావేశం సోమవారం వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా, గిరిజన ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులైన ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు సైతం వైసీపీకి చెందిన వారు కావడంతో సమావేశంలో అనేక సమస్యలపై వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశముంది. ముఖ్యంగా జీవో:3, గిరిజన స్పెషల్‌ డీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలనే అంశాలతో రాజకీయంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే రోడ్లు, డోలీ మోతలు, తాగునీటి సమస్యలపైనా అధికారులను నిలదీసే అవకాశముంది. ఏజెన్సీలో వైద్యఆరోగ్యశాఖ పనితీరు అధ్వానంగా ఉండడం, అనేక పీహెచ్‌సీల్లో వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, ఐటీడీఏ పీవో మొదలు, ముఖ్యమైన అనేక అధికారుల పోస్టులు ఇన్‌చార్జులతోనే ఉండడం వంటివి చర్చకు రానున్నారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అంశాలను సైతం ప్రస్తుతం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆయా సమస్యలున్నాయనే తీరులో సమావేశంలో అధికార పక్షాన్ని నిలదీయాలని వైసీపీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. అయితే ఆయా ప్రశ్నలకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, ఆర్టీసీ విజయనగరం జోన్‌ చైర్మన్‌ దొన్నుదొర దీటుగా సమాధానాలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఐటీడీఏ 74వ పాలకవర్గ సమావేశం ఎలా జరుగుతుందోననేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Apr 20 , 2025 | 11:13 PM