ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వంతెన గతి ఇంతేనా?

ABN, Publish Date - May 07 , 2025 | 12:24 AM

మండలంలోని భీంపోలు పంచాయతీ శివారులో ఉన్న రామచంద్రపురం గెడ్డపై వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోయింది. ఈ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో దీని పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

ఉధృతంగా ప్రవహిస్తున్న రామచంద్రపురం గెడ్డ(ఫైల్‌)

- మూడేళ్ల క్రితం నిధులు మంజూరైనా ప్రారంభంకాని రామచంద్రపురం బ్రిడ్జి నిర్మాణ పనులు

- టెండర్లు పిలిచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు

- ప్రాణాలకు తెగించి గిరిజనులు గెడ్డ దాటాల్సిన దుస్థితి

అనంతగిరి, మే 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని భీంపోలు పంచాయతీ శివారులో ఉన్న రామచంద్రపురం గెడ్డపై వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోయింది. ఈ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో దీని పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

రామచంద్రపురం గెడ్డపై వంతెన నిర్మాణానికి 2022లోని గత ప్రభుత్వం ఎస్‌ఏ గ్రాంటు కింద రూ.2.75 కోట్లను మంజూరు చేసింది. వంతెన పనులు ప్రారంభించేలా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపారు. పలుమార్లు వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరుకావడంతో తమ కష్టాలు తీరతాయని గిరిజనులు ఆనందించారు. అయితే పనులు ప్రారంభంకాకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు ఉధృతంగా ప్రవహించే గెడ్డను ప్రాణాలకు తెగించి దాటుకుంటూ అవతలి వైపు ఉన్న గ్రామాలకు అతికష్టం మీద చేరుకుంటున్నారు.

సారవానిపాలెం, జీలుగులపాడు వంతెనలు పూర్తి

మండలంలోని కాశీపట్నం పంచాయతీ సారవానిపాలెం వంతెనకు రూ.2.2 కోట్లు, చిలకలగెడ్డ పంచాయతీ జీలుగులపాడు వంతెనకు రూ.2.5 కోట్లు, రామచంద్రపురం వంతెనకు రూ.2.75 కోట్ల నిధులు ఒకేసారి మంజూరయ్యాయి. అయితే సారవానిపాలెం వంతెన పనులు పూర్తికావడంతో రాకపోకలు సాగుతున్నాయి. అలాగే జీలుగులపాడు గోస్తనిపై వంతెన దాదాపుగా పూర్తయింది. అయితే కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రామచంద్రపురం వంతెన పనులే ఇంకా ప్రారంభం కాలేదు.

రామచంద్రపురం వంతెన పూర్తయితే..

రామచంద్రపురం గెడ్డపై వంతెన పూర్తయితే సరియాపల్లి, రామచంద్రపురం, రాళ్లగెడ్డ, అలాగే గుమ్మకోట పంచాయతీలోని పలు గ్రామాల ప్రజల రాకపోకలకు వీలుగా ఉంటుంది. వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే గెడ్డను దాటాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - May 07 , 2025 | 12:24 AM