ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వాణిజ్య భవనాల్లో భద్రత ప్రశ్నార్థకం?

ABN, Publish Date - Jul 24 , 2025 | 01:27 AM

నగర శివారు ప్రాంతంలోని గ్రామ పంచాయతీల పరిధిలో నిర్మిస్తున్న అతిపెద్ద వాణిజ్య భవనాలు, దుకాణాల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గండిగుండం నుంచి విజయనగరానికి సమీపంలోని దాకమర్రి, నీలకుండీలు నుంచి పద్మనాభం మండలం శివారు గ్రామాల వరకు అనేకచోట్ల వాణిజ్య భవనాలు, కళాశాలలు, పాఠశాలల భవనాలు, కాంప్లెక్స్‌లు నిర్మాణమయ్యాయి. ఆయా భవనాలకు అన్ని అనుమతులు ఉన్నాయా, ముఖ్యంగా అగ్ని మాపక శాఖ అనుమతి తీసుకున్నారా, సంబంధిత పరికరాలను అమర్చారా?...అనే దానిపై సందేహాలు నెలకొంటున్నాయి.

నగర శివారులో విరివిగా భారీ భవనాల నిర్మాణం

అగ్నిమాపక శాఖ అనుమతులపై సందిగ్ధం

సంబంధిత పరికరాల ఏర్పాటుపై కొరవడిన సమాచారం

ఇటీవల గండిగుండం ఐటీసీ గోదాములో అగ్ని ప్రమాదం

అయినా పట్టించుకోని పంచాయతీల సిబ్బంది

విశాఖపట్నం, జూలై 22 (ఆంధ్రజ్యోతి):

నగర శివారు ప్రాంతంలోని గ్రామ పంచాయతీల పరిధిలో నిర్మిస్తున్న అతిపెద్ద వాణిజ్య భవనాలు, దుకాణాల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గండిగుండం నుంచి విజయనగరానికి సమీపంలోని దాకమర్రి, నీలకుండీలు నుంచి పద్మనాభం మండలం శివారు గ్రామాల వరకు అనేకచోట్ల వాణిజ్య భవనాలు, కళాశాలలు, పాఠశాలల భవనాలు, కాంప్లెక్స్‌లు నిర్మాణమయ్యాయి. ఆయా భవనాలకు అన్ని అనుమతులు ఉన్నాయా, ముఖ్యంగా అగ్ని మాపక శాఖ అనుమతి తీసుకున్నారా, సంబంధిత పరికరాలను అమర్చారా?...అనే దానిపై సందేహాలు నెలకొంటున్నాయి.

ఇటీవల ఆనందపురం మండలం గండిగుండం పంచాయతీ రామవరం రోడ్డులోని ఐటీసీ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి సమయం కావడంతో గోదాములో సరకు మాత్రమే కాలిపోయింది. అదే పగటిపూట జరిగితే భారీగా ప్రాణ నష్టం సంభవించేదని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

శివారు ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు

జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల పరిధిలో పలు విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు, భారీ భవనాలు, గోడౌన్లు నిర్మితమయ్యాయి. వాణిజ్య అవసరాల కోసం నిర్మించే ప్రతి భవనానికీ అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. అయితే గ్రామీణ ప్రాంతంలో ఎన్ని భవనాలకు ఈ అనుమతులున్నాయనే దానిపై సమాచారం కొరవడుతోంది. నగరంలో భారీ భవనాలు నిర్మించదలిస్తే పలు శాఖల అనుమతులు ఉంటేనే పట్టణ ప్రణాళికా విభాగం ప్లాన్‌ను ఆమోదించే అవకాశం ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతంలో భారీ నిర్మాణాలకు అనుమతుల విషయంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సర్పంచులు లేదా అధికారపార్టీ నేతల మాట కాదనే పరిస్థితి లేకపోవడంతో వారు మిన్నకుంటున్నారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో భారీ భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, పన్నులు విధించడంలో సర్పంచుల మాటే చెల్లుబాటవుతోందని చెబుతున్నారు.

సమాచారంపై సందిగ్ధం

ఆనందపురం మండల పరిసరాల్లో పలు విద్యాసంస్థలు పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. కొందరు భూ యజమానులు ఆయా విద్యాసంస్థల కోసం భారీ భవనాలు నిర్మించి అందజేస్తున్నారు. వీటికి అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకున్నారా లేదా అనే దానిపై పంచాయతీ కార్యదర్శుల వద్దే సరైన సమాచారం లేదు. పెద్ద గోదాములు, భవనాలకు వీఎంఆర్‌డీఏ అనుమతులు ఇస్తోందని, అయినా పంచాయతీ కార్యదర్శులు పన్నులు విధించే సమయంలో అన్ని పత్రాలూ ఉన్నాయో లేదో చూడాల్సిన బాధ్యత ఉందని పంచాయతీ రిటైర్డు అధికారి ఒకరు తెలిపారు. విద్యా సంస్థల్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. గండిగుండం ఐటీసీ గోదాములో సంభవించిన అగ్ని ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రామీణ ప్రాంతంలోని వాణిజ్య భవనాలు, సముదాయాలు, విద్యాసంస్థల భవనాలకు అగ్నిమాపక శాఖ అనుమతులున్నాయా, ప్రమాదాల నివారణకు అవసరమైన ఫైర్‌ఫైటింగ్‌ సామగ్రి అందుబాటులో ఉంచారా?, లేదా?...అనేది పంచాయతీ అధికారులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు.

Updated Date - Jul 24 , 2025 | 01:27 AM