సినిమా థియేటర్లలో తనిఖీలు
ABN, Publish Date - May 30 , 2025 | 01:07 AM
: పట్టణంలోని పలు థియేటర్లను ఆర్డీవో షేక్ ఆయీషా, తహసీల్దార్ విజయ్‌కుమార్ గురువారం వేర్వేరుగా తనిఖీ చేశారు. పర్తిసాయి, షిర్డిసాయి, సత్యనారాయణ థియేటర్‌లను తనిఖీ చేసిన తహసీల్దార్... తినుబండారాల ధరలు అధికంగా ఉన్నట్టు అభిప్రాయ పడ్డారు. దీనిపై థియేటర్ల నిర్వాహకులకు హెచ్చరికలు చేశామన్నారు.
తినుబండారాల ధరలు అధికంగా ఉన్నట్టు గుర్తింపు
అనకాపల్లి టౌన్, మే 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు థియేటర్లను ఆర్డీవో షేక్ ఆయీషా, తహసీల్దార్ విజయ్‌కుమార్ గురువారం వేర్వేరుగా తనిఖీ చేశారు. పర్తిసాయి, షిర్డిసాయి, సత్యనారాయణ థియేటర్‌లను తనిఖీ చేసిన తహసీల్దార్... తినుబండారాల ధరలు అధికంగా ఉన్నట్టు అభిప్రాయ పడ్డారు. దీనిపై థియేటర్ల నిర్వాహకులకు హెచ్చరికలు చేశామన్నారు. లైసెన్సులు, పారిశుధ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్డీవో షేక్ ఆయీషా రామచంద్ర థియేటర్‌ను తనిఖీ చేశారు. లైసెన్సు గడువు ముగుస్తున్నందున రెన్యూవల్ చేయించుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నామని వారు చెప్పగా, ఆ దరఖాస్తును శుక్రవారం ఉదయం కార్యాలయంలో సమర్పించాలని ఆర్డీవో ఆదేశించారు. థియేటర్ లోపల కూడా పరిశీలించి సీటింగ్ కెపాసిటీ, ఎగ్జిట్ ద్వారాలపై ఆరా తీశారు. టికెట్ కలెక్షన్ వివరాలను అడిగి తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇనివ్వాలని స్పష్టం చేశారు. తినుబండారాల ధరల పట్టికను పరిశీలించి నిర్వాహకులను ఆరా తీశారు. ఆమె వెంట తహసీల్దార్ విజయ్‌కుమార్, ఆర్‌ఐ రమేశ్, సిబ్బంది ఉన్నారు.
పరవాడలో..
పరవాడ, మే 29 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు పరవాడ సీతారామయ్య సినీ కాంప్లెక్స్ థియేటర్‌లో తహసీల్దార్ ఎస్‌వీ అంబేడ్కర్ గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా థియేటర్‌లో ప్రేక్షకులకు కల్పిస్తున్న వసతులు, టికెట్ల ధరలు, పార్కింగ్ ఫీజు, తినుబండరాల ధరలు, మరుగుదొడ్ల నిర్వహణపై తనిఖీలు చేపట్టారు. థియేటర్ లైసెన్సుతో పాటు నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నారా లేదా అన్నది ఆరా తీశారు. అన్నీ సక్రమంగానే వున్నట్టు ఆయన నిర్ధారించారు.
Updated Date - May 30 , 2025 | 01:07 AM