అల్లూరి జయంతి ఏర్పాట్ల పరిశీలన
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:22 AM
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని ఈ నెల 4న స్థానిక అల్లూరి పార్కులో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మంగళవారం సాయంత్రం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కులో జరుగుతున్న పనులను నర్సీపట్నం ఆర్డీవో రమణ, పర్యాటకశాఖ మేనేజర్ మనోరమ, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇప్పటికే పార్కులో, సమాధుల మందిరంలో విద్యుత్ అలంకరణతో పాటు ప్రహరీ గోడ, భవనాలు, నూతనంగా నిర్మిస్తున్న నాలుగు పగోడాల టైల్స్ మరమ్మతులు, రంగులువేసే పనులను పరిశీలించి అధికారులు, స్థానిక నాయకులకు ఆయన పలు సూచనలు చేశారు.
- పార్కును సందర్శించి అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పలు సూచనలు
- 4న ఘనంగా నిర్వహించాలని ఆదేశం
కృష్ణాదేవిపేట, జూలై 1(ఆంధ్రజ్యోతి) : విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని ఈ నెల 4న స్థానిక అల్లూరి పార్కులో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మంగళవారం సాయంత్రం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కులో జరుగుతున్న పనులను నర్సీపట్నం ఆర్డీవో రమణ, పర్యాటకశాఖ మేనేజర్ మనోరమ, ఇతర అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇప్పటికే పార్కులో, సమాధుల మందిరంలో విద్యుత్ అలంకరణతో పాటు ప్రహరీ గోడ, భవనాలు, నూతనంగా నిర్మిస్తున్న నాలుగు పగోడాల టైల్స్ మరమ్మతులు, రంగులువేసే పనులను పరిశీలించి అధికారులు, స్థానిక నాయకులకు ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులు, నాయకులతో సమావేశం నిర్వహించి ఈ నెల 4న ఉదయం అల్లూరి జయంతి సందర్భంగా విద్యార్థులతో భారీ ర్యాలీ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, అల్లూరి వేషధారణతో నాటకం, పూలతో సమాధుల ముస్తాబు, సభా వేదిక వద్ద ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కె.దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఎంపీలు సీఎం రమేశ్, కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర అధికారులు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ తహశీల్దార్ శ్రీనివాసరావు, ఈవోపీఆర్‌డీ కె.శ్రీనివాస్, నర్సీపట్నం మునిసిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేశ్, టీడీపీ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు చిటికెల తారక వేణుగోపాల్, చోద్యం సర్పంచ్ గోపాలకృష్ణ, టీడీపీ నాయకులు బొడ్డు జమీలు, లగుడు రాజు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 12:22 AM