ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు

ABN, Publish Date - May 23 , 2025 | 12:54 AM

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌పై నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయంతో భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయానికి సంఘీభావంగా గురువారం అనకాపల్లిలో తిరంగా యాత్ర నిర్వహించారు. ఎంపీతోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్యఅతిథులుగా హాజరై రింగురోడ్డు వద్ద యాత్రను ప్రారంభించారు.

: సభలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర. వేదికపై ఎంపీ సీఎం రమేశ్‌, మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు, బండారు, పంచకర్ల, సుందరపు, రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు, తదితరులు

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి గుణపాఠం చెప్పాం

ఎంపీ సీఎం రమేశ్‌

అనకాపల్లిలో భారీఎత్తున తిరంగా యాత్ర

పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు

కొత్తూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌పై నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయంతో భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయానికి సంఘీభావంగా గురువారం అనకాపల్లిలో తిరంగా యాత్ర నిర్వహించారు. ఎంపీతోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్యఅతిథులుగా హాజరై రింగురోడ్డు వద్ద యాత్రను ప్రారంభించారు. జాతీయ పతాకాలు చేతబూని ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ పెరుగుబజారు మీదుగా నెహ్రౌచౌక్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి పలువురి ప్రాణాలు తీశారని, పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టబెట్టడానికి కేంద్రం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నిర్వహించి ఆ దేశ భూభాగంలోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిందని అన్నారు. భారతదేశం సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పిందని పేర్కొన్నారు. తీవ్రవాదులను అంతం చేసే వరకు ఆపరేషన్‌ సిందూర్‌ ఆగదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బలోపేతం అవుతున్న భారతదేశంతో యుద్ధం చేసే సత్తా ఇప్పుడు శత్రుదేశాలకు లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, మళ్ల సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ సైనికుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, మాజీ సైనికులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:54 AM