ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హౌసింగ్‌లో ఇన్‌చార్జుల పాలన

ABN, Publish Date - Jul 15 , 2025 | 12:42 AM

రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో ఇన్‌చార్జుల పాలన సాగుతోంది. జిల్లాలోని 24 మండలాలకు నలుగురు ఏఈలతో, అలాగే తొమ్మిది మంది డీఈలు ఉండాల్సి ఉండగా, ముగ్గురితోనే నెట్టుకొస్తోంది. ఒక్కొక్కరికి నాలుగు నుంచి ఐదు మండలాలను అప్పగించి ఇన్‌చార్జులుగా కొనసాగిస్తోంది.

నాతవరంలోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయ భవనం

24 మండలాలకు నలుగురు ఏఈలు

జిల్లాలో 9 మంది డీఈలకు గాను ముగ్గురితోనే పనులు

అసాధ్యంగా మారిన ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణ

బిల్లుల తయారీ, మంజూరులోనూ జాప్యం

నాతవరం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో ఇన్‌చార్జుల పాలన సాగుతోంది. జిల్లాలోని 24 మండలాలకు నలుగురు ఏఈలతో, అలాగే తొమ్మిది మంది డీఈలు ఉండాల్సి ఉండగా, ముగ్గురితోనే నెట్టుకొస్తోంది. ఒక్కొక్కరికి నాలుగు నుంచి ఐదు మండలాలను అప్పగించి ఇన్‌చార్జులుగా కొనసాగిస్తోంది.

జిల్లాలో 24 మండలాలకు నలుగురు ఏఈలు మాత్రమే ఉన్నారు. వీరంతా ఆ మండలాలకు ఇన్‌చార్జులుగా విధులు నిర్వహిస్తున్నారు. నాతవరం, చోడవరం, అనకాపల్లి, పరవాడ ఏఈలకు 24 మండలాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కరు నాలుగైదు మండలాల బాధ్యతలు చూడాల్సి ఉండడంతో పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు. వచ్చే ఆగస్టు నాటికి ఎన్టీఆర్‌ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించినా ఏఈల కొరతతో అది సాధ్యంకాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం, గొలుగొండ, నర్సీపట్నం మండలాలతో పాటు నర్సీపట్నం మునిసిపాలిటీకి కూడా నాతవరం మండల హౌసింగ్‌ ఏఈ జోగారావు ఇన్‌చార్జి ఏఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే మిగతా మండలాలకు ముగ్గురే బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇలాగైతే సకాలంలో గృహ నిర్మాణాలు ఎలా పూర్తవుతాయని పలువురు ప్రశ్నిస్తు న్నారు. దీనికి తోడు గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు ప్రస్తుతం బదిలీలలో నిమగ్నమై ఉన్నారు. హౌసింగ్‌ ఏఈలు వీరితో సమన్వయం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే జిల్లాలో 9 మంది హౌసింగ్‌ డీఈలు ఉండాల్సి ఉండగా పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి డీఈలు మాత్రమే ఉన్నారు. వీరికి మిగతా మండలాల బాధ్యతలు అప్పగించారు. వీరు ఆయా మండలాలకు వెళ్లి రావడమే సరిపోతోందని, అందుకే బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతోందని తెలిసింది. సుమారు ఇరవై రోజుల క్రితం చాలా మంది పదవీవిరమణ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jul 15 , 2025 | 12:42 AM