ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డోలీ మోతలు ఇంకెన్నాళ్లు?

ABN, Publish Date - Apr 27 , 2025 | 01:13 AM

మండలంలోని అర్ల పంచాయతీ శివారు నీళ్లబంధ గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీ మోతలు తప్పడం లేదు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆరు కిలోమీటర్లు డోలీలో తరలించాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ గ్రామానికి చెందిన బాలుడిని శనివారం డోలీలో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.

అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడిని డోలీలో ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

- నీళ్లబంధ గ్రామానికి రహదారి సౌకర్యం లేక అవస్థలు

- అనారోగ్యానికి గురైన బాలుడిని ఆరు కిలోమీటర్లు డోలీలో తరలించాల్సిన దుస్థితి

- అధికారులు స్పందించాలని గిరిజనుల వేడుకోలు

రోలుగుంట, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని అర్ల పంచాయతీ శివారు నీళ్లబంధ గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీ మోతలు తప్పడం లేదు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆరు కిలోమీటర్లు డోలీలో తరలించాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ గ్రామానికి చెందిన బాలుడిని శనివారం డోలీలో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.

కొయ్యూరు మండలం చిట్టెంపాడు ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న గెమ్మెలి సింహాద్రి(9)కి పాఠశాలలోనే చేతులకు, శరీరానికి మొత్తం కురుపులు రావడంతో ఈ నెల 15న స్వగ్రామం నీళ్లబంధకు వచ్చేశాడు. గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. నడవడానికి శక్తి కూడా లేదు. ఈ గ్రామానికి ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్త కూడా రారు. వైద్యం చేయించుకోవాలంటే రోడ్డు సదుపాయం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ బాలుడికి జ్వరం ఎక్కువ కావడంతో తండ్రి, తాతయ్య, మరో ఇద్దరి సహాయంతో ఆరు కిలోమీటర్లు డోలీలో మోసుకుంటూ ఎత్తైన కొండలు దాటి రావికమతం మండలం కుంజుర్తి గ్రామం వరకు వచ్చారు. అనంతరం కుంజుర్తి గ్రామం నుంచి మళ్లీ డోలీలో స్వగ్రామానికి ఆ బాలుడిని తీసుకువెళ్లారు. పింఛన్‌ తీసుకోవడానికి కూడా నీళ్లబంధ నుంచి పిత్రిగెడ్డ వరకు కాలినడకన వస్తున్నామని గిరిజనులు తెలిపారు. ప్రభుత్వ వైద్యులు తమ గ్రామానికి ఎప్పుడూ రారని, ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకోవడానికి వెళతామని వారు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.

Updated Date - Apr 27 , 2025 | 01:13 AM