ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నగరంలో హైఅలర్ట్‌

ABN, Publish Date - May 09 , 2025 | 01:23 AM

పాకిస్థాన్‌తో యుద్ధం నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.

పాకిస్థాన్‌తో యుద్ధం నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తం

బీచ్‌రోడ్డులో వాహనాల తనిఖీ

విశాఖపట్నం, మే 9 (ఆంధ్రజ్యోతి):

పాకిస్థాన్‌తో యుద్ధం నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరం సముద్ర తీరంలో ఉండడం, ఇక్కడే తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం కూడా ఉండడంతో కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు హైఅలర్ట్‌ ప్రకటించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నగర పోలీసులు గురువారం రాత్రి బీచ్‌రోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టారు. రికార్డులతోపాటు వాహనంలో ఉన్నవారి వివరాలను పరిశీలించారు. యారాడ నుంచి భీమిలి వరకు బీచ్‌ రోడ్డు మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి పూర్తిస్థాయిలో విచారించాలని అధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారం.

Updated Date - May 09 , 2025 | 01:23 AM