ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముంచంగిపుట్టులో భారీ వర్షం

ABN, Publish Date - Jul 06 , 2025 | 11:45 PM

మండలంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది.

ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్టలో కూలిపోయిన ఇంటి గోడ

ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు

బంగారుమెట్టలో కూలిన ఇంటి గోడ

జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లోకి పెరిగిన ఇన్‌ఫ్లో

ముంచంగిపుట్టు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): మండలంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని బంగారుమెట్టలో బి.నీలమ్మ అనే గిరిజన మహిళ ఇంటి గోడ కూలిపోయింది. గోడ బయటకు కూలిపోవడంతో ప్రమాదం తప్పిందని బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నేత చందు దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే భారీ వర్షాలకు బూసిపుట్టు, బుంగాపుట్టు, లక్ష్మీపురం తదితర పంచాయతీల పరిధిలో గల తుడుమురాయి, ఉబ్బెంగుల, తుమిడిపుట్టు, కర్లాపొదర్‌ తదితర గ్రామాల్లో గెడ్డలు, వాగులు, వంకలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. స్థానికులు అతికష్టంపై గెడ్డ దాటుతూ రాకపోకలు సాగిస్తున్నారు. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లోకి వరదనీరు ఇన్‌ఫ్లో పెరిగిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

Updated Date - Jul 06 , 2025 | 11:45 PM