ముంచంగిపుట్టులో భారీ వర్షం
ABN, Publish Date - Jun 22 , 2025 | 10:36 PM
మండల పరిధిలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
ముంచంగిపుట్టు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మండల కేంద్రంలో డ్రైనేజీల గుండా వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. నాలుగు రోడ్ల కూడలి చిత్తడిగా మారింది. మండల కేంద్రం నుంచి పెదబయలు, జోలాపుట్టు, సంగడ, లక్ష్మీపురం, కుమడ వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల పైనుంచి పలు చోట్ల వర్షపు నీరు ప్రవహించింది. మట్టి రోడ్లు బురదగా మారడంతో వాహనచోదకులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లోకి వరదనీరు ఇన్‌ఫ్లో పెరిగిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
Updated Date - Jun 22 , 2025 | 10:36 PM