మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం
ABN, Publish Date - May 18 , 2025 | 12:46 AM
జిల్లా మాడుగుల, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాసింది. వేడిగాలులకు ఉక్కపోత తోడవ్వడంతో జనం చెమటతో ఉక్కిరిబిక్కిరి పడ్డారు.
(ఆంధ్రజ్యోతి- న్యూస్ నెట్‌వర్క్)
జిల్లా మాడుగుల, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాసింది. వేడిగాలులకు ఉక్కపోత తోడవ్వడంతో జనం చెమటతో ఉక్కిరిబిక్కిరి పడ్డారు. మధ్యాహ్నం తరువాత ఆకాశం మేఘావృతమై ఉరుములు, పిడుగులతో వర్షం మొదలైంది. ఈదురు గాలులు కూడా వీచాయి. గొలుగొండ మండలంలోని పలుగ్రామాల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. దేవరాపల్లి మండలంలో మోస్తరు వర్షం కురిసింది. కూరకాయ పంటలు, సరుగుడు పంటలకు వర్షం మేలు చేస్తుందని రైతులు చెప్పారు. మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో మధ్యాహ్నం మూడు గంటల తరువాత మోస్తరు వర్షం పడింది.
Updated Date - May 18 , 2025 | 12:46 AM