ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భారీ వర్షం

ABN, Publish Date - Jun 14 , 2025 | 11:01 PM

జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తరువాత వర్షం పడింది. అనకాపల్లి, నర్సీపట్నం, గొలుగొండ, సబ్బవరం, పాయకరావుపేట, ఎలమంచిలిలో చిరుజల్లులు కురిశాయి.

దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్సు ప్రహరీ గోడపై పడిన చెట్టు

పలు మండలాల్లో సాయంత్రం కుమ్మేసిన వాన

అనకాపల్లి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తరువాత వర్షం పడింది. అనకాపల్లి, నర్సీపట్నం, గొలుగొండ, సబ్బవరం, పాయకరావుపేట, ఎలమంచిలిలో చిరుజల్లులు కురిశాయి. ఎస్‌.రాయవరం, పరవాడ, రాంబిల్లి మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. చోడవరం, కశింకోట, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో కొద్దిసేపు వర్షం పడింది. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

కె.కోటపాడులో...

కె.కోటపాడు: మండల కేంద్రం కె.కోటపాడు పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో సుమారు గంట సేపు వర్షం పడింది. ఈ వర్షం కూరగాయల పంటలకు ఊపిరి పోసిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

మాడుగులలో..

మాడుగుల రూరల్‌: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మెరుపులు, ఉరుములతో వర్షం పడింది. ఉదయం నుంచి మద్యాహ్నం మూడు గంటల వరకు ఎండ కాసింది. తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మెరుపులు, ఉరుములతో వర్షం పడింది.

కృష్ణాదేవిపేటలో..

కృష్ణాదేవిపేట: గొలుగొండ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం వర్షం పడింది. ఏఎల్‌పురం, కొంగశింగి, సీహెచ్‌ నాగాపురం, పాతకృష్ణాదేవిపేట, లింగంపేట తదితర గ్రామాల్లో ఉదయం నుంచి ముసుగు వాతావరణం నెలకొంది. ఈ వర్షం ఖరీఫ్‌ సాగుకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దేవరాపల్లిలో..

దేవరాపల్లి: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి స్థానిక పోలీస్‌ స్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద చెట్లు విరిగిపడ్డాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగానే ఉంది. సాయంత్రం అయ్యే సరికి వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. స్థానిక జూనియర్‌ కళాశాల వద్ద విద్యుత్‌ తీగలపై చెట్టు కొమ్మలు పడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

Updated Date - Jun 14 , 2025 | 11:01 PM