పయనీర్ లారీలకు భారీ జరిమానా
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:44 AM
మండలంలోని పయనీర్ కంపెనీకి అధికలోడుతో వస్తున్న లారీలకు నర్సీపట్నం ఎంవీఐ రూ.3,92,000 జరిమానా విధించినట్టు ఎస్‌ఐ దామోదరనాయుడు తెలిపారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంగళవారం విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వస్తుండగా.. మాకవరపాలెం మండలం రాజుపేట సమీపంలో అధిక లోడుతో వస్తున్న లారీలను గమనించి అడ్డుకున్న విషయం విదితమే.
రూ.3,92,000 పెనాలిటీ విధించిన రవాణా శాఖ అధికారులు
మాకవరపాలెం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పయనీర్ కంపెనీకి అధికలోడుతో వస్తున్న లారీలకు నర్సీపట్నం ఎంవీఐ రూ.3,92,000 జరిమానా విధించినట్టు ఎస్‌ఐ దామోదరనాయుడు తెలిపారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంగళవారం విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వస్తుండగా.. మాకవరపాలెం మండలం రాజుపేట సమీపంలో అధిక లోడుతో వస్తున్న లారీలను గమనించి అడ్డుకున్న విషయం విదితమే. ఇవి రాచపల్లిలోని పయనీర్ కంపెనీకి ముడిసరకు రవాణా చేస్తున్నట్టు వే బిల్లుల ద్వారా గుర్తించారు. విషయం తెలిసి పోలీసులు, పలు శాఖల అధికారులు అక్కడకు చేరుకున్నారు. అధిక లోడుతో వస్తున్న టిప్పర్ల కారణంగా తాళ్లపాలెం వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని స్పీకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు ఆయా లారీలను స్వాధీనం చేసుకొని, జరిమానాలు విధించడానికి రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. నరీపట్నం ఎంవీఐ వీటిని తనిఖీ చేసి, పరిమితికి ముడి సరకును రవాణా చేస్తున్నందుకు ఏడు లారీలకు రూ.3,92,000 జరిమానా విధించారు.
Updated Date - Aug 01 , 2025 | 12:44 AM