ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెరపల్లి క్వారీలో గ్రానైట్‌ దోపిడీ

ABN, Publish Date - Jul 05 , 2025 | 11:10 PM

మండలంలోని పెదబరడ పంచాయతీ తెరపల్లి క్వారీలో గ్రానైట్‌ దోపిడీ జరుగుతోంది. తీసుకున్న అనుమతులకు నాలుగు రెట్లు అదనంగా లీజుదారులు తవ్వకాలు జరిపారు. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం గండిపడింది. గిరిజనుల ఫిర్యాదుతో తనిఖీ చేసిన రెవెన్యూ అధికారుల తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి.

గ్రానైట్‌ తవ్వకాలు నిర్వహిస్తున్న తెరపల్లి క్వారీ

పరిమితికి మించి తవ్వకాలు

4.2 ఎకరాలకు అనుమతులు

20 ఎకరాల్లో తవ్వకాలు

పాటించని పర్యావరణ నిబంధనలు

అనుమతులు లేకుండా బ్లాస్టింగ్‌

తహశీల్దార్‌ తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన అక్రమాలు

చింతపల్లి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): తెరపల్లి గ్రానైట్‌ క్వారీలో అక్రమాలు జరుగుతున్నాయని స్థానిక గిరిజనులు ఇటీవల ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఫిర్యాదు చేశారు. గ్రానైట్‌ క్వారీ తవ్వకాలతో స్థానిక గిరిజనులు అస్వస్థతకు గురువుతున్నారని, పొలాల్లో క్వారీ వ్యర్థాలు డంపింగ్‌ చేస్తున్నారని, భూగర్భజలాలు అంతరించిపోతున్నాయని, తవ్వకాల్లోనూ ప్రభుత్వ నిబంధనలు పాటించడంలేదని ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం చింతపల్లి తహశీల్దార్‌ టి. రామకృష్ణ తెరపల్లి గ్రానైట్‌ క్వారీని సందర్శించారు. గ్రానైట్‌ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని సర్వే చేశారు. క్వారీ నిర్వహణలో పలు అక్రమాలు బయటపడ్డాయి. 2022లో వైసీపీ ప్రభుత్వం తెరపల్లి గ్రామంలో సర్వే నంబరు 68/4, 6, 69/2లో 4.2 ఎకరాల్లో గ్రానైట్‌ తవ్వకాలకు లక్ష్మి ఎస్టీ మైనింగ్‌ లీజింగ్‌ లేబర్‌ కాంట్రాక్టు మ్యూచువలి ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌కి అనుమతులను మంజూరు చేసింది. ఈ సొసైటీకి కడపకు చెందిన బానవతు పాండు అధ్యక్షుడుగా, స్థానిక గిరిజనులు సభ్యులుగా వున్నారు. 2022 నుంచి తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రానైట్‌ తవ్వకాలకు 4.2 ఎకరాలు లీజుకు తీసుకున్నారు. కానీ 20 ఎకరాల్లో గ్రానైట్‌ తవ్వకాలు జరిపినట్టు తహశీల్దార్‌ పరిశీలనలో వెల్లడైంది. అసలు పర్యావరణ నిబంధనలు ఏ ఒక్కటీ పాటించడం లేదు. తవ్వకాలకు బ్లాస్టింగ్‌ చేసేటప్పుడు అనుమతులు తీసుకోవడం లేదు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ రామకృష్ణ మాట్లాడుతూ అనుమతులు లేకుండా పేలుడు సామగ్రిని ఉపయోగించి బ్లాస్టింగ్‌ చేస్తున్నారన్నారు. క్వారీలో అక్రమాలను ప్రశ్నించిన స్థానిక గిరిజన మహిళ రమణమ్మను భాస్కరరావు అనే వ్యక్తి కులం పేరున దూషించాడని, దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందని తహశీల్దార్‌ తెలిపారు. గ్రానైట్‌ క్వారీలో జరుగుతున్న అక్రమాలపై గనుల శాఖకు నివేదిక పంపిస్తున్నామన్నారు. తదుపరి చర్యలు సంబంధిత శాఖ అధికారులు తీసుకుంటారని తహశీల్దార్‌ రామకృష్ణ తెలిపారు.

Updated Date - Jul 05 , 2025 | 11:10 PM