వైభవంగా ముత్యాలమ్మ అనుపోత్సవం
ABN, Publish Date - Apr 27 , 2025 | 10:55 PM
ముత్యాలమ్మ అనుపోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం జాతర ఆఖరి రోజు కావడంతో అమ్మవారి అనుపోత్సవాన్ని స్వయంగా వీక్షించాలని వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అమ్మవారి సంబరం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైంది.
భారీ ఊరేగింపు నడుమ అమ్మవారి పాదాలు ఆలయానికి తరలింపు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విభిన్న వేషధారణలు
చింతపల్లి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ముత్యాలమ్మ అనుపోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం జాతర ఆఖరి రోజు కావడంతో అమ్మవారి అనుపోత్సవాన్ని స్వయంగా వీక్షించాలని వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అమ్మవారి సంబరం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైంది. అనుపోత్సవంలో భాగంగా సాయిబాబా ఆలయం నుంచి సుర్లవారి స్థావరాల వరకు భారీ ఊరేగింపు సాగింది. అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు సుర్లవారి స్థావరంలో ముత్యాలమ్మ పాదాలు(గరగలు)కి అర్చకుడు సుర్ల అప్పారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి పాదాలను టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎంపీపీ కోరాబు అనుషదేవి, భక్తులు శిరస్సుపై మోసుకుంటూ భారీ ఊరేగింపు నడుమ ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అమ్మవారి పాదాలు పట్టణ పురవీధుల నుంచి వస్తుంటే స్థానిక భక్తులు ఎదురొచ్చి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం తిరిగి సుర్లవారి స్థావరాలకు తరలించారు. ఊరేగింపులో ప్రదర్శించిన విభిన్న వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనుపోత్సవంలో జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, మేజర్ పంచాయతీ సర్పంచ్ దురియా పుష్పలత, టీడీపీ సీనియర్ నాయకురాలు బొర్ర విజయరాణి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దురియా హేమంత్, ప్రధాన కార్యదర్శి పసుపులేటి వినాయకరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదిరెడ్ల బేతాళుడు, సుర్ల వంశీయులు తిరుపతిరావు, వీరేంద్ర, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Updated Date - Apr 27 , 2025 | 10:55 PM