ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయి నిర్మూలనకు ప్రభుత్వ చర్యలు భేష్‌

ABN, Publish Date - Jul 27 , 2025 | 11:11 PM

గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నదని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. గిరిజన ప్రాంతానికి గంజాయి అపకీర్తిని తొలగించేందుకు అధికార యంత్రంగం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు

మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు

చింతపల్లి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నదని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. గిరిజన ప్రాంతానికి గంజాయి అపకీర్తిని తొలగించేందుకు అధికార యంత్రంగం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా మూలాలు గిరిజన ప్రాంతం(విశాఖ మన్యం)వైపు చూపిస్తున్నాయన్నారు. గిరిజన ప్రాంతీయుడిగా, మాజీ మంత్రిగా ఈ విషయంపై చింతిస్తున్నానన్నారు. గిరిజన ప్రాంతంలో గంజాయి నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. గంజాయి వల్ల యువత ఏ విధంగా నష్టపోతున్నారో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చారన్నారు. గిరిజన ప్రాంతంలో గతంతో పోల్చుకుంటే గంజాయి సాగు పూర్తిగా తగ్గిందన్నారు. ప్రస్తుతం ఒడిశా నుంచి గంజాయి ఎగుమతి చేస్తూ పట్టుబడుతున్నారని చెప్పారు. గంజాయి రవాణా గిరిజన ప్రాంతం మీదుగా జరుగుతుందన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ఈగిల్‌ వ్యవస్థను తీసుకు రావడం శుభపరిణామమన్నారు. గంజాయి సాగు, రవాణా మూలాలను కట్టడి చేయాలని, పొరుగు రాష్ట్రాల వ్యాపారులపై దృష్టి సారించాలని సూచించారు. గంజాయి ఎక్కడ సాగు చేస్తున్నారు?, పట్టుబడిన వ్యక్తులకు ఎవరు బెయిల్‌ ఇస్తున్నారు?, సాగు, రవాణాను ఎవరు ప్రోత్సహిస్తున్నారు? అనే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. గిరిజనులను ఆదాయ పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సహించడం, పర్యాటకాభివృద్ధి చేపట్టడం వల్ల రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతానికి ఉన్న గంజాయి మచ్చ పూర్తిగా తొలగిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 27 , 2025 | 11:11 PM