ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అల్లం ధర పతనం

ABN, Publish Date - Jun 25 , 2025 | 10:37 PM

ఏజెన్సీలో అల్లం ధర పతనమైంది. పసుపు, పిప్పలు మాదిరిగా అల్లం సాగుకు గిరిజన రైతులు ప్రాధాన్యమిస్తారు. అల్లం ధర ఎప్పుడు.. ఎలా ఉంటుందో స్పష్టత ఉండదు.

గిరిజనులు వారపు సంతకు తెచ్చిన అల్లం

వారపు సంతలో కేజీ ధర రూ.22

గత వారం రూ.35లకు వ్యాపారుల కొనుగోలు

ఈ వారం తగ్గిన ధర

నిరాశ చెందిన గిరిజన రైతులు

జి.మాడుగుల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో అల్లం ధర పతనమైంది. పసుపు, పిప్పలు మాదిరిగా అల్లం సాగుకు గిరిజన రైతులు ప్రాధాన్యమిస్తారు. అల్లం ధర ఎప్పుడు.. ఎలా ఉంటుందో స్పష్టత ఉండదు. గత మంగళవారం వారపు సంతలో అల్లం కేజీ ధర రూ.35 వరకు పలికింది. ఈ వారం వారపు సంతలో కేజీ అల్లం ధర రూ.22లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో అల్లం రైతులు నిరాశ చెందారు. అయితే వర్షాలు అధికంగా ఉన్నప్పుడు అల్లం ఽధర తగ్గుతూ వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. అల్లంపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్లే నష్టపోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. పసుపు, పిప్పళ్లు, కాఫీ, మిరియాల మాదిరిగా వడ్డాది మాడుగుల, తదితర ప్రాంతాల వ్యాపారులు వచ్చి అల్లం కూడా కొనుగోలు చేస్తే వీటికి కనీస మద్దతు ధర పలుకుతుందని గిరిజనులు అంటున్నారు. స్థానిక వ్యాపారులు కొనుగోలు చేయడం వల్లే ధర హెచ్చు తగ్గులకు కారణమని గిరిజనులు పేర్కొంటున్నారు.

Updated Date - Jun 25 , 2025 | 10:37 PM