ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:46 AM
తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇటీవల కాలంలో కోటవురట్ల మండలంలో ఆరు, నర్సీపట్నం, మాకవరపాలెం, కశింకోట మండలాల్లో మూడేసి, రోలుగుంట, బుచ్చెయ్యపేట, ఎలమంచిలి మండలాల్లో రెండేసి, ఎలమంచిలి మునిసిపాలిటీ, నాతవరం మండలాల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 23 కేసులు నమోదయ్యాయి.
63 తులాల బంగారం, 6.5 తులాల వెండి స్వాధీనం
అనకాపల్లి రూరల్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇటీవల కాలంలో కోటవురట్ల మండలంలో ఆరు, నర్సీపట్నం, మాకవరపాలెం, కశింకోట మండలాల్లో మూడేసి, రోలుగుంట, బుచ్చెయ్యపేట, ఎలమంచిలి మండలాల్లో రెండేసి, ఎలమంచిలి మునిసిపాలిటీ, నాతవరం మండలాల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 23 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసులను దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం కోటవురట్ల మండలం రాజుపేట జంక్షన్ వద్ద ఆరుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి 63 తులాల బంగారం, 6.5 తులాల వెండి, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో జువెలైన్ హోమ్‌కు, మిగిలిన ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకొని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభకనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలను ఎస్పీ అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ (క్రైమ్) ఎల్.మోహన్‌రావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు, నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:46 AM