ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముంతాజ్‌లో నిల్వ ఆహారం

ABN, Publish Date - Jul 08 , 2025 | 01:05 AM

నగరంలోని నరసింహనగర్‌లో గల ముంతాజ్‌ హోటల్‌లో రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాన్ని ఆహార భద్రతా, ప్రమాణాల శాఖ అధికారులు సోమవారం గుర్తించారు.

  • ఫ్రిజ్‌లో 32 కిలోల చికెన్‌ ఐటమ్స్‌

  • వేడి చేసి వినియోగదారులకు అందజేస్తున్నట్టు గుర్తించిన

  • ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారులు

  • కేసు నమోదు

విశాఖపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని నరసింహనగర్‌లో గల ముంతాజ్‌ హోటల్‌లో రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాన్ని ఆహార భద్రతా, ప్రమాణాల శాఖ అధికారులు సోమవారం గుర్తించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా హోటల్‌కు వెళ్లిన అధికారులు సుమారు 32 కిలోల చికెన్‌ ఐటమ్స్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసినట్టు గుర్తించారు. ఇందులో చికెన్‌ ఫ్రై పీస్‌, జాయింట్స్‌ వంటివి ఉన్నాయి. ఆయా ఆహార పదార్థాలను బయట పడేయించారు. చికెన్‌ పదార్థాలను నిల్వ చేసినట్టు నిర్ధారణ కావడంతోపాటు సిబ్బంది కూడా అంగీకరించడంతో కేసు నమోదు చేసినట్టు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ జీవీ అప్పారావు తెలిపారు.

హోటళ్లకు వెళుతున్నారా జాగ్రత్త..

నగర పరిధిలోని అనేక హోటళ్లలో ఇదే పరిస్థితి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను రోజుల తరబడి నిల్వ ఉంచి, వాటినే మళ్లీ వేడి చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. అటువంటి ఆహారాన్ని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, కేన్సర్‌ వంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు. ఈ మధ్య కాలంలో తనిఖీలు చేస్తున్న అనేక హోటళ్లలో ఇదే విధమైన ఆహార పదార్థాలను గుర్తిస్తున్నామని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ జీవీ అప్పారావు వివరించారు.

Updated Date - Jul 08 , 2025 | 01:05 AM