మత్స్యకారులకు ‘భరోసా’ రేపు
ABN, Publish Date - Apr 25 , 2025 | 12:53 AM
సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన భృతి అందజేయనున్నది. శనివారం నక్కపల్లిలో ఏర్పాటు చేసే జిల్లాస్థాయి కార్యక్రమంలో రాష్ట్ర హోం, విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత, మత్స్యకారులకు భృతి పంపిణీ చేస్తారని మత్స్య శాఖ సహాయ సంచాలకులు ప్రసాద్ చెప్పారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం మత్స్యకార సంఘాల నాయకులతో నక్కపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
వేట నిషేధ కాలంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం
ఒక్కో మత్స్యకారుడికి రూ.20 వేల చొప్పున భృతి
జిల్లాలో 12 వేల మందికి రూ.24 కోట్లు విడుదల
నక్కపల్లిలో హోం మంత్రి అనిత చేతుల మీదుగా పంపిణీ
నక్కపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన భృతి అందజేయనున్నది. శనివారం నక్కపల్లిలో ఏర్పాటు చేసే జిల్లాస్థాయి కార్యక్రమంలో రాష్ట్ర హోం, విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత, మత్స్యకారులకు భృతి పంపిణీ చేస్తారని మత్స్య శాఖ సహాయ సంచాలకులు ప్రసాద్ చెప్పారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం మత్స్యకార సంఘాల నాయకులతో నక్కపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మత్స్యకార భరోసా’ పథకం కింద ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జిల్లాలో 12 వేల మంది మత్స్యకారులకు రూ.24 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. సభ నిర్వహణకు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. కాగా ఈ కార్యక్రమానికి మత్స్యకారులంతా హాజరుకావాలని టీడీపీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేశ్ కోరారు. ఈ సమావేశంలో మత్స్యకార నాయకులు మేరుగు నాగేశ్వరరావు, గోసల చినతాతారావు, ఎరుపిల్లి అప్పలరాజు, గరికిన సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 25 , 2025 | 12:53 AM