ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోదాములో అగ్ని కీలలు

ABN, Publish Date - Jul 05 , 2025 | 12:39 AM

విద్యుత్‌ షార్ట్‌ షర్క్యూట్‌ కారణంగా పెదబొడ్డేపల్లి మార్కెట్‌ యార్డు గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించి రూ.70 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.

గోదాములో మంటలు ఎగసిపడుతున్న దృశ్యం

పెదబొడ్డేపల్లి మార్కెట్‌ యార్డులో ప్రమాదం

రూ.60 లక్షలు విలువ చేసే పసుపు దుంపలు దగ్ధం

మరో రూ.10 లక్షల విలువైన యంత్రాలకు నష్టం

మంటలను అదుపుచేసిన రెండు అగ్నిమాపక శకటాలు

పరిశీలించిన మార్కెటింగ్‌ శాఖ ఏడీ

నర్సీపట్నం, జూలై 4 (ఆంధ్రజ్యోతి):

విద్యుత్‌ షార్ట్‌ షర్క్యూట్‌ కారణంగా పెదబొడ్డేపల్లి మార్కెట్‌ యార్డు గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించి రూ.70 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.

బెస్ట్‌ ఆర్గానిక్‌ పసుపు వ్యాపారి పెదిరెడ్ల గోవింద్‌ ఏఎంసీ గోదామును అద్దెకు తీసుకున్నాడు. ఏజెన్సీలో పసుపు దుంపలు కొనుగోలు చేసి ఇక్కడ పాలిష్‌ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత గోదాము నుంచి మంటలు వ్యాపించడాన్ని ఓ కలాసీ గమనించి ఏఎంసీ సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇచ్చాడు. అతడు అగ్నిమాపక కేంద్రానికి తెలియపరచడంతో అగ్నిమాపక అధికారి అప్పలస్వామి, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. నర్సీపట్నం, రావికమతం నుంచి వచ్చిన రెండు అగ్నిమాపక శకటాలతో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

గోదాములో రూ.60 లక్షల విలువ చేసే సుమారు 50 మెట్రిక్‌ టన్నుల పసుపు దుంపలు నిల్వ ఉన్నాయి. అవన్నీ మంటల్లో కాలిపోయాయని వ్యాపారి వాపోయారు. కాగా మరో రూ.10 లక్షలు విలువ చేసే పాలిషింగ్‌ యంత్రాలు, డ్రమ్ములు కూడా దగ్ధమయ్యాయన్నారు. మంటలు కారణంగా గోదాము గోడలకు పగళ్లు ఏర్పడ్డాయి. ఏఎంసీ చైర్మన్‌ గవిరెడ్డి రమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా అగ్నిమాక అధికారి ఆర్వీ రమణ, మార్కెటింగ్‌శాఖ ఏడీ ఎల్‌.అశోక్‌కుమార్‌, ఆర్డీవో వీవీ రమణ, మునిసిపల్‌ కమిషనర్‌ సురేంద్ర గోదామును పరిశీలించి, వివరాలు సేకరించారు. మార్కెటింగ్‌ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం అధికారుల బృందం శనివారం గోదామును పరిశీలిస్తుందని ఏఎంసీ సెక్రటరీ ఎన్‌.భువనేశ్వరి తెలిపారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:39 AM