ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సరుగుడు, వెన్నలపాలెం గ్రామాల్లో జ్వరాల విజృంభణ

ABN, Publish Date - Jul 30 , 2025 | 12:40 AM

మండలంలోని వెన్నలపాలెం, సరుగుడు గ్రామాల్లో వైరల్‌ జ్వరాలు, అతిసార ప్రబలాయి. జ్వరంతో బాధపడుతూ సరుగుడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతిచెందాడు. గ్రామంలో పలువురు గిరిజనులు జ్వరాలబారినపడి మంచాల్లో మగ్గుతున్నారు. వైద్య సిబ్బంది గ్రామం వైపు కన్నెత్తి అయినా చూడడం లేదని ఆరోపిస్తున్నారు. సరుగుడు గ్రామానికి చెందిన జైతి శివ(32)కు సోమవారం జ్వరంతోపాటు విరేచనాలు అధికం కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. సరుగుడు గ్రామంలో 40 మందికిపైగా గిరిజనులు జ్వరాలతో అల్లాడుతున్నారు.

జ్వరం, విరేచనాలతో మృతిచెందిన జైతి శివ (ఫైల్‌ ఫొటో)

సరుగుడుకు చెందిన ఒక యువకుడి మృతి

వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని బాధితుల వినతి

నాతవరం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెన్నలపాలెం, సరుగుడు గ్రామాల్లో వైరల్‌ జ్వరాలు, అతిసార ప్రబలాయి. జ్వరంతో బాధపడుతూ సరుగుడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతిచెందాడు. గ్రామంలో పలువురు గిరిజనులు జ్వరాలబారినపడి మంచాల్లో మగ్గుతున్నారు. వైద్య సిబ్బంది గ్రామం వైపు కన్నెత్తి అయినా చూడడం లేదని ఆరోపిస్తున్నారు. సరుగుడు గ్రామానికి చెందిన జైతి శివ(32)కు సోమవారం జ్వరంతోపాటు విరేచనాలు అధికం కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. సరుగుడు గ్రామంలో 40 మందికిపైగా గిరిజనులు జ్వరాలతో అల్లాడుతున్నారు.

కాగా మర్రిపాలెం పంచాయతీ శివారు వెన్నలపాలెంలో బళ్ల బసవయ్య, వాసిరెడ్డి దేవుళ్లు, గొంప రాము, కోరుప్రోలు చినతల్లి, వాసిరెడ్డి పైడియ్యనాయుడు, మాకిరెడ్డి మురళీమోహన్‌, కుసిరెడ్డి సత్యవతి తదితరులు వారం రోజుల నుంచి వైరల్‌ జ్వరాలతో అల్లాడుతున్నారు. వైద్య సిబ్బంది తక్షణమే స్పందించి సరుగుడు, వెన్నలపాలెం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి కోరారు.

Updated Date - Jul 30 , 2025 | 12:40 AM