ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అగ్రహారంలో జ్వరాల విజృంభణ

ABN, Publish Date - Mar 28 , 2025 | 12:06 AM

మండలంలోని జీకేవీధి పంచాయతీ అగ్రహారం గ్రామంలో జ్వరాలు విజృంభించాయి. గురువారం ఓ గిరిజన యువకుడు జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. గ్రామంలో సుమారు పది మంది జ్వరాలతో బాధపడుతున్నారని స్థానికులు తెలిపారు.

శివకుమార్‌(ఫైల్‌ ఫొటో)

- గిరిజన యువకుడి మృతి

- గ్రామంలో పలువురికి అస్వస్థత

గూడెంకొత్తవీధి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జీకేవీధి పంచాయతీ అగ్రహారం గ్రామంలో జ్వరాలు విజృంభించాయి. గురువారం ఓ గిరిజన యువకుడు జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. గ్రామంలో సుమారు పది మంది జ్వరాలతో బాధపడుతున్నారని స్థానికులు తెలిపారు. అగ్రహారం గ్రామంలో నాలుగు రోజుల క్రితం గిరిజనులు జ్వరాలు బారినపడ్డారు. గ్రామానికి చెందిన కాకర శివకుమార్‌(26)కి జ్వరం రావడంతో రెండు రోజుల క్రితం జీకేవీధి వచ్చి ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స చేయించుకున్నాడు. అయితే అతని పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది స్పందించి గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:06 AM