వేగవంతంగా అభివృద్ధి పనులు
ABN, Publish Date - May 08 , 2025 | 12:51 AM
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అఽధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. జిల్లాలోని రోడ్లు, భవనాల నిర్మాణ పనులపై వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అఽధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. జిల్లాలోని రోడ్లు, భవనాల నిర్మాణ పనులపై వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనులను రానున్న వర్షాకాలంలోగా పూర్తి చేయాలని, పెండింగ్ బిల్లులు సమర్పిస్తే ప్రభుత్వంతో మాట్లాడి బిల్లుల చెల్లింపులకు కృషి చేస్తామన్నారు. రహదారులు, భవన నిర్మాణాలకు నిధుల సమస్య లేదని, ప్రభుత్వం అవసరమైనన్ని నిధులు విడుదల చేస్తుందన్నారు. పనుల్లో జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు నుంచి పెదబయలు మండలం పిట్టలబొర్ర, అనంతగిరి మండలం కటికి రోడ్డు పనుల ప్రగతిపై ఆరా తీశారు. నీతి ఆయోగ్ నిధులతో చేపడుతున్న అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని గిరిజన సంక్షేమశాఖ ఇంజనీర్లను ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 34 రోడ్డు పనులు మంజూరు చేశామన్నారు. రహదారుల నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతులకు జిల్లా స్థాయి కమిటీలో ప్రతిపాదనలు చేయాలన్నారు. జీకేవీధి- ఆర్వీనగర్ మధ్య రహదారి పనులపై రహదారులు భవనాల ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. చింతూరు డివిజన్‌లో 14 పనులకు నాలుగు పనులు పూర్తి చేశారని, మిగిలిన పనులు గడువులోగా పూర్తి చేయాలన్నారు. పంచాయతీరాజ్ ప్రాజెక్ట్సు విభాగానికి రూ.390 కోట్లతో 146 పనులు మంజూరయ్యాయని, వాటి టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రాజెక్ట్సు ఈఈ శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈ కె.వేణుగోపాల్, పంచాయతీరాజ్ ఈఈ కొండయ్యపడాల్, డ్వామా పీడీ డాక్టర్ విద్యాసాగర్, డీఈఈలు, ఏఈఈలు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 08 , 2025 | 12:51 AM