ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైళ్లలో విస్తృత తనిఖీలు

ABN, Publish Date - Jul 04 , 2025 | 12:02 AM

ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పలు మార్గాల్లో గంజాయి రవాణా అవుతున్న నేపథ్యంలో రైళ్లలో ముమ్మరంగా తనిఖీ చేస్తున్నామని ఎస్పీ అమిత్‌బర్ధార్‌ తెలిపారు.

విలేకరులతో మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌ బర్ధార్‌

గంజాయి రవాణాను అడ్డుకునేందుకు చర్యలు

ఎస్పీ అమిత్‌ బర్ధార్‌

అరకులోయ, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పలు మార్గాల్లో గంజాయి రవాణా అవుతున్న నేపథ్యంలో రైళ్లలో ముమ్మరంగా తనిఖీ చేస్తున్నామని ఎస్పీ అమిత్‌బర్ధార్‌ తెలిపారు. గురువారం ఆయన అరకు రైల్వే స్టేషన్‌లో కిరండోల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్మగ్లర్లు కోరాపుట్‌, మల్కన్‌గిరి ప్రాంతాల నుంచి రైలులో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు గంజాయిని తరలిస్తున్నారని, అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నట్టు తెలిసిందన్నారు. అన్ని మార్గాల్లో నిఘాను ముమ్మరం చేసి గంజాయి రవాణాను అడ్డుకుంటామని చెప్పారు. ఈ తనిఖీల్లో పాడేరు డీఎస్పీ షేక్‌ షెహబాజ్‌ అహ్మద్‌, అరకు సీఐ ఎల్‌.హిమగిరి, ఎస్‌ఐ గోపాలరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:02 AM