ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏషియన్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో ఎర్రాజి జ్యోతి సరికొత్త రికార్డు

ABN, Publish Date - May 30 , 2025 | 12:52 AM

ఏషియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో నగరానికి చెందిన ఒలింపియన్‌ ఎర్రాజి జ్యోతి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం కైవసం

విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి):

ఏషియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో నగరానికి చెందిన ఒలింపియన్‌ ఎర్రాజి జ్యోతి సరికొత్త రికార్డు నెలకొల్పింది. కొరియాలో జరుగుతున్న ఈ మీట్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి స్వర్ణపతకం కైవసం చేసుకుంది. అంతేకాకుండా 100 మీటర్ల రేస్‌ను మెరుపు వేగంతో 12.96 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త ఆసియా రికార్డు నెలకొల్పింది. ఏషియన్‌ గేమ్స్‌, ఏషియన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీల్లో పతకాలు సాధించడమే కాకుండా ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి విశాఖ అథ్లెట్‌ జ్యోతి కావడం విశేషం. ఈ సందర్భంగా అథ్లెటిక్స్‌ సంఘం ప్రతినిధులు డి.నాగేశ్వరరావు, ఎం.నారాయణరావు, ఇతర ప్రతినిధులు ఆమెను అభినందించారు.

Updated Date - May 30 , 2025 | 12:52 AM