ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాగునీటికి భరోసా

ABN, Publish Date - May 20 , 2025 | 01:46 AM

సాగునీటి కాలువల్లో ఎట్టకేలకు ఆరేళ్ల తరువాత నిర్వహణ పనులు జరుగుతున్నాయి.

పంట కాలువలకు మహర్దశ

ఉపాధి హామీ పథకం కింద పూడిక తీత, తుప్పల తొలగింపు

జిల్లాలో రూ.19.85 కోట్లతో 558 పనులు

మరో నెల రోజుల్లో పూర్తయ్యేలా అధికారులు కృషి

అన్నదాతలకు తీరనున్న సాగునీటి కష్టాలు

నర్సీపట్నం. మే 19 (ఆంధ్రజ్యోతి):

సాగునీటి కాలువల్లో ఎట్టకేలకు ఆరేళ్ల తరువాత నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకం నిధులతో కాలువల్లో పూడిక తీత, తుప్పలు తొలగింపు, మదుములకు మరమ్మతు వంటి పనులు చేపట్టారు. రిజర్వాయర్లు, చెరువుల ఆయకట్టుకు సంబంధించి సుమారు రూ.20 కోట్లుతో 558 పనులు చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే పలు పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను మరో నెల రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం జిల్లాలో అన్ని రంగాల మాదిరిగానే సాగునీటి వ్యవస్థను సైతం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. జలాశయాల ఆయకట్టు కాలువలు, ఆనకట్టలు, చెరువుల మదుములు, పంట కాలువల నిర్వహణను గాలికొదిలేసింది. ఒక్క ఏడాది కూడా నిర్వహణ, మరమ్మతు పనులు చేయించిన పాపానపోలేదు. దీంతో కాలువల్లో పూడిక పేరుకుపోయి, తుప్పలు పెరిగిపోయాయి. నీటి ప్రవాహం సక్రమంగా జరగక, చివరి భూములకు నీరు అందని పరిస్థితి నెలకొంది. చెక్‌ డ్యాములు, ఆనకట్టకు మరమ్మతు పనులు చేయకపోవడంతో నదిలో నుంచి కాలువలకు నీరు ప్రవహించేది కాదు. మదుములు పాడైపోవడంతో నీరు వృథాగా పోతున్నది. సాగునీటి వనరులకు నిర్వహణ, అభివృద్ధి పనులు చేయాలని రైతులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఇరిగేషన్‌ అధికారులు ఏటా నిధుల కోసం ప్రతిపాదనలు చేయడం, వాటిని ప్రభుత్వం బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో అన్నదాతలు విసిగిపోయి, కొన్నిచోట్ల శ్రమదానంతో పూడికలు తీసి, తుప్పలు తొలగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభం కావడంతో సాగునీటి వనరులకు నిర్వహణ, మరమ్మతు పనులు చేయడానికి వీలు కాలేదు. ఈ ఏడాది (2026) కచ్చితంగా పనులు చేయిస్తామని అప్పట్లోనే మంత్రి రామానాయుడు, ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ మేరకు జల వనరుల శాఖ జిల్లా అధికారులు పంట కాలువల్లో పూడిక తీత పనులకు అంచనాలు తయారు చేసి ఉపాధి హామీ పథకం అధికారులకు (డ్వామా) పంపించారు. గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో రూ.19.85 కోట్ల అంచనాలతో 558 పనులు ప్రారంభించారు. కాలువల్లో పూడికతీత, తుప్పలు తొలగింపు, మదుములకు మరమ్మతు పనులు చేపట్టారు. మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయిన తాండవ రిజర్వాయర్‌ కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో రెండు నెలల క్రితమే పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి. ఇంకా రైవాడ, పెద్దేరు, కోనాం, కల్యాణపులోవ, రావణాపల్లి రిజర్వాయర్ల పంట కాలువలు, వివిధ గ్రోయిన్లు, చెరువుల కింద వున్న కాలువల్లో పూడిక తీత, తుప్పల తొలగింపు పనులు జోరుగా సాగుతున్నాయి.

మండలం పనులు నిధులు

అనకాపల్లి 54 రూ.1.37 కోట్లు

అచ్యుతాపురం 19 రూ.83 లక్షలు

బుచ్చెయ్యపేట 22 రూ.45 లక్షలు

చోడవరం 19 రూ.88 లక్షలు

దేవరాపల్లి 19 రూ.67 లక్షలు

కె.కోటపాడు 11 రూ.38 లక్షలు

కశింకోట 30 రూ.97 లక్షలు

కోటవురట్ల 4 రూ.11 లక్షలు

మాడుగుల 58 రూ.2.35 కోట్లు

మాకవరపాలెం 10 రూ.40 లక్షలు

మునగపాక 37 రూ.1.77 కోట్లు

నక్కపల్లి 11 రూ.44 లక్షలు

నాతవరం 26 రూ.1.06 కోట్లు

పాయకరావుపేట 33 రూ.1.13 కోట్లు

రాంబిల్లి 4 రూ.15 లక్షలు

రావికమతం 13 రూ.52 లక్షలు

రోలుగుంట 5 రూ.8 లక్షలు

ఎస్‌.రాయవరం 131 రూ.4.15 కోట్లు

సబ్బవరం 16 రూ.67 లక్షలు

ఎలమంచిలి 23 రూ.89 లక్షలు

చీడికాడ 21 రూ.85 లక్షలు

Updated Date - May 20 , 2025 | 01:46 AM