ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంజనీరింగ్‌, ఎం ఫార్మా పీజీ కోర్సులకు 7 వేల దరఖాస్తులు

ABN, Publish Date - Apr 28 , 2025 | 12:45 AM

రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్‌, ఎం ఫార్మా పీజీ కోర్సులకు సుమారు ఏడు వేల దరఖాస్తులు అందాయి. గత ఏడాది సుమారు 11 వేల మంది విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మరో మూడు రోజులు గడువు ఉండడంతో అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 28న ఏపీ పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌ విడులైంది. ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఈనెల 30 వరకు అవకాశం

జూన్‌ 6 నుంచి 8 వరకు ప్రవేశ పరీక్ష

విశాఖపట్నం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్‌, ఎం ఫార్మా పీజీ కోర్సులకు సుమారు ఏడు వేల దరఖాస్తులు అందాయి. గత ఏడాది సుమారు 11 వేల మంది విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మరో మూడు రోజులు గడువు ఉండడంతో అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 28న ఏపీ పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌ విడులైంది. ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఇంజనీరింగ్‌ 12 బ్రాంచుల్లో ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు చేపట్టనున్నారు. వీటిలో బయోటెక్నాలజీ, కెమి కల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌, ఎల క్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, ఫుడ్‌ టెక్నా లజీ, జియో ఇంజనీరింగ్‌ అండ్‌ జియో ఇన్ఫర్మేటిక్స్‌, ఇన్‌స్ర్టుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జీ, నానో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీఈసెట్‌ నిర్వహిస్తున్నారు. ఎం ఫార్మసీ కోర్సుల్లోనూ ప్రవేశాలకు ఇదే ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి. మల్లికార్జునరావు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఇదీ షెడ్యూల్‌..

ప్రవేశ పరీక్షకు ఈ నెల 30 వరకు దరఖాస్తులను స్వీక రించనున్నారు. మే ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు రూ.వెయ్యి, వేయి మే పదో తేదీ నుంచి 15 వరకు రూ.2 వేలు, మే 16 నుంచి 20 వరకు రూ.4 వేలు, మే 21 నుంచి 26 వరకు రూ.10 వేల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 25 నుంచి 27 వరకు తప్పుల ను సవరించుకునేందుకు అవకాశం కల్పించారు. మే 31న విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ మధ్య పరీక్షలను నిర్వ హించనున్నామని, రాష్ట్రంలో 17, హైదరాబాద్‌లోని ఒక కేంద్రంలో పరీక్ష నిర్వహిస్తామని సెట్‌ కన్వీనర్‌ తెలిపారు.

Updated Date - Apr 28 , 2025 | 12:45 AM