రేపటి నుంచి డీఎస్సీ పరీక్షలు
ABN, Publish Date - Jun 05 , 2025 | 01:21 AM
జిల్లాలో ఈనెల ఆరో తేదీ నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు. జిల్లాలోని 12 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.
30వ తేదీ వరకూ నిర్వహణ
57,895 మంది అభ్యర్థులు, 12 కేంద్రాలు
జాయింట్ కలెక్టర్
విశాఖపట్నం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఈనెల ఆరో తేదీ నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు. జిల్లాలోని 12 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. చైతన్య ఇంజనీరింగ్ కళాశాల (కొమ్మాది), ఎస్‌వీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ (పెదగంట్యాడ) ఐయాన్ డిజిటల్స్ (షీలానగర్, చినముషిడివాడ), ఏడీజడ్ ఆర్వోనా డిజిటల్ (నియర్ ఎన్‌ఎస్‌టీఎల్), గాయత్రి విద్యాపరిషత్ (మధురవాడ, రుషికొండ), విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల (దువ్వాడ), ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ (శొంఠ్యాం), విట్స్ (నరవ)లో కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి 2.30 నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు రెండుపూటలా పరీక్షలు జరుగుతాయన్నారు. ఆయా కేంద్రాల్లో చిన్నపాటి లోపం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పరీక్షలకు మొత్తం 57,895 మంది దరఖాస్తు చేశారన్నారు. సమీక్షలో డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ జగదీశ్వరరావు, ఆర్‌ఐవో మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 01:21 AM