డీఆర్ డిపో ఏర్పాటు చేయాలి
ABN, Publish Date - Jun 13 , 2025 | 01:08 AM
తమకు ప్రత్యేకంగా డీఆర్ డిపో ఏర్పాటు చేసి, రేషన్ కష్టాలు తీర్చాలంటూ మండలంలోని మారుమూల రొంపల్లి పంచాయతీ బూరిగ, చినకోనేల గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. ఈ రెండు గ్రామాల్లో 80 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి.
బూరిగ, చినకోనెల గ్రామాల గిరిజనులు డిమాండ్
బియ్యం మూటల కావిళ్లతో నిరసన
అనంతగిరి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): తమకు ప్రత్యేకంగా డీఆర్ డిపో ఏర్పాటు చేసి, రేషన్ కష్టాలు తీర్చాలంటూ మండలంలోని మారుమూల రొంపల్లి పంచాయతీ బూరిగ, చినకోనేల గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. ఈ రెండు గ్రామాల్లో 80 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. వీరు సుమారు ఎనిమిది కిలో మీటర్ల దూరంలో వున్న రొంపల్లి గ్రామంలోని డీఆర్ డిపోకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాలి. వెళ్లడానికి ఎనిమిది కిలోమీటర్లు, బియ్యం మూటలు మోసుకుంటూ మరో ఎనిమిది కిలోమీటర్లు నడవాల్సి వస్తున్నదని వాపోతున్నారు. గురువారం అటవీ మార్గంలో కావిళ్లతో బియ్యం మూటలు మూసుకుంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధికారులు స్పందించి రొంపల్లి, ఎన్‌ఆర్‌పురం పంచాయతీల పరిధిలోని చిమిడివలస, రాయిపాడు, బొంగిజ, డేంజనివలస, బూరిగ, చినకోనెల గ్రామాలకు అందుబాటులో వుండేలా డీఆర్ డిపోను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Updated Date - Jun 13 , 2025 | 01:08 AM