ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గుళిరాగి సాగుతో రెట్టింపు దిగుబడులు

ABN, Publish Date - Jun 19 , 2025 | 11:25 PM

గుళిరాగి పద్ధతిలో రాగి(చోడి) సాగు చేసుకోవడం వల్ల రెట్టింపు దిగుబడులు సాధించవచ్చునని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గుళిరాగి పద్ధతి సాగులో సాధారణ సాగు కంటే మూడు రెట్లు అధికంగా ఎకరాకు 14-16 క్వింటాళ్ల దిగుబడులు సాధించవచ్చునని అంటున్నారు.

గుళిరాగి పద్ధతిలో నాట్లు వేస్తున్న గిరిజన రైతులు

ఎకరానికి 14 నుంచి 16 క్వింటాళ్ల దిగుబడి

ఏపీసీఎన్‌ఎఫ్‌ ద్వారా రైతులకు ప్రోత్సాహం

జిల్లాలో ఈ ఏడాది 5 వేల మంది రైతులతో సాగుకు ప్రణాళిక

చింతపల్లి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): గుళిరాగి పద్ధతిలో రాగి(చోడి) సాగు చేసుకోవడం వల్ల రెట్టింపు దిగుబడులు సాధించవచ్చునని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గుళిరాగి పద్ధతి సాగులో సాధారణ సాగు కంటే మూడు రెట్లు అధికంగా ఎకరాకు 14-16 క్వింటాళ్ల దిగుబడులు సాధించవచ్చునని అంటున్నారు.

గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు సుదీర్ఘకాలంగా సంప్రదాయంగా రాగి(చోడి) సాగు చేపడుతున్నారు. కాలక్రమంలో సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుతం పాడేరు డివిజన్‌ పరిధిలో గిరిజన రైతులు 18,176 హెక్టారుల్లో సాగు చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం(జెడ్‌బీఎన్‌ఎఫ్‌)లో భాగంగా చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ వచ్చింది. తాజాగా ఇదే కార్యక్రమాన్ని ఏపీసీఎన్‌ఎఫ్‌(ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ మేనేజ్డ్‌ ప్రకృతి వ్యవసాయం) ద్వారా వ్యవసాయశాఖ కొనసాగిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ రైతులను గుళిరాగి పద్ధతిలో రాగి సాగు చేపట్టేందుకు వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తున్నది. అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గుళిరాగి సాగును శ్రీకాకుళం, విజయనగరం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విస్తరింపజేయాలని ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారు.

నారు మడి తయారీ

గుళి రాగి సాగుకు తొలుత నారుమడి తయారుచేసుకోవాలి. వెదజల్లే పద్ధతిలో ఎకరానికి పది కిలోల విత్తనం అవసరం. గుళిరాగి పద్ధతిలో ఎకరానికి కేవలం 300 గ్రాముల విత్తనం సరిపోతుంది. రైతులు తొలుత మీటరు వెడల్పు, ఐదు మీటర్లు పొడవుగల నారుమడులను సిద్ధం చేసుకోవాలి. నేలను మొత్తగా చేసుకున్న తరువాత ఘనజీవామృతం (100 కిలోల పశువుల పేడ, ఐదు కిలోల మూత్రం, రెండు కిలోల శనగపిండి, ఒక కిలో పుట్టమట్టిగాని, గట్టుమట్టిగాని కలుపుకుని వారం రోజులు నీడలో భద్రపర్చుకోవాలి) నారుమడిలో వేసుకోవాలి. ఎంపిక చేసుకున్న విత్తనాలను జీవామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. 300 గ్రాముల విత్తనం శుద్ధికి 200ఎంఎం జీవామృతం సరిపోతుంది.

నారు..

విత్తనశుద్ధి చేసుకున్న విత్తనాలను రెండు గంటల పాటు నీడలో ఎండబెట్టుకుని ముందుగా సిద్ధం చేసుకున్న మడిలో నారు పోసుకోవాలి. నారుమడిలో విత్తనాలు వేసుకున్న తరువాత ఎండుగడ్డిని వేసుకోవాలి. అనంతరం జీవామృతం(20 లీటర్ల నీరు, ఐదు కిలోల ఆవుపేడ, ఐదు లీటర్ల మూత్రం, 200 గ్రామలు శనగపిండి, కొద్దిగా పుట్టమట్టి కలుపుకోవాలి) నారుమడిపై విడతలవారీగా చిలకరించుకోవాలి. మూడు రోజుల తరువాత మొక్కలు వచ్చిన తరువాత ఎండుగడ్డిని తొలగించుకోవాలి. ప్రతి రోజు మొక్కలను నీటితో తడుపుకోవాలి. జూన్‌ రెండవ పక్షం నుంచి జూలై నెలాఖరు వరకు నారు పోసుకోవచ్చు.

పంట పొలం తయారీ..

రాగి నాట్లు వేసుకునేందుకు రెండు, మూడు దుక్కులు చేసుకుని పంట పొలం సిద్ధం చేసుకోవాలి. అఖరి దుక్కిలో ఎకరానికి ఘనజీవామృతం నాలుగు వందల కిలోలు వేసుకుని కలియదున్నుకోవాలి.

గుళి పద్ధతిలో నాట్లు..

వర్షాలు కురిసిన వెంటనే నాట్లు వేసుకోవాలి. 12-14 రోజుల వయస్సు కలిగిన నారును మాత్రమే నాటుకోవాలి. వరిలో శ్రీపద్ధతి అనుసరించిన మాదిరిగా గుళిరాగి పద్ధతిలో నాట్లు వేసుకోవాలి. మొక్కలు, వరుసల మధ్య అడుగు ఎడం పాటిస్తూ మొక్కలను నాటుకోవాలి. నాట్లు లైన్లుగా వేసుకునేందుకు తాడును ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకటీ, రెండు మొక్కలను మాత్రమే నాటుకోవాలి. నేలలో మొక్క వేర్లు లోపలికి వెళ్లినంతగా 10 ఎంఎంలోతులోనే నాటుకోవాలి. మొక్కలను లోతుగా నాటుకోరాదు. జూలై మొదటి వారం నుంచి ఆగస్టు మొదటి వారం వరకు నాట్లు వేసుకోవచ్చు.

సస్యరక్షణ..

నాట్లు వేసుకున్న 20 రోజులకు జీవామృతాన్ని మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. రెండు వందల లీటర్ల నీటిలో 20 కిలోల పశువుల పేడ, 10 లీటర్ల మూత్రం, రెండు కిలోల శనగపిండి, కిలో పుట్టమట్టిని ఒక డ్రమ్‌లో కలుపుకోవాలి. ఏడు రోజుల పాటు నీడలో భద్రపరుచుకుని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కలుపుతూ ఉండాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న జీవామృతాన్ని గుడ్డతో రెండుసార్లు వడగట్టుకుని మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా 20-30 రోజుల వ్యవధిలో పంటకాలలో మూడుసార్లు పిచికారీ చేసుకోవాలి.

చెక్కలాగుట..

గుళి రాగి పద్ధతిలో చెక్కలాగుట చాలా కీలకం. మొక్కలు నాటుకున్న 15 రోజులకు ఒకసారి చొప్పున మూడుసార్లు తేలిక పాటి చెక్కను మొక్కలపై నుంచి లాగాలి. ఈ విధంగా చేయడం వల్ల మొక్కలు వంగి నేలకు తాకి అధిక సంఖ్యలో పిలకలు మొలకెత్తుతాయి.

కలుపు నివారణ:

సైకిల్‌ వీడర్‌ సహాయంతో కలుపు నివారించుకోవాలి. సైకిల్‌ వీడర్‌ని మొక్కలు, వరుసల మధ్య నడిపిస్తే కలుపు మొక్కలు భూమిలో కలిసిపోతాయి. ప్రతి 20 రోజులకు ఒకసారి సైకిల్‌వీడర్‌ని నడిపించుకుని కలుపు నివారించుకోవాలి.

Updated Date - Jun 19 , 2025 | 11:25 PM